ఓరియంట్ ప్రజాభిప్రాయ సేకరణ గురించి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు.
![]() |
| జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్న దేవాపూర్ గిరిజన సంఘాల నాయకులు, ఓరియంట్ కార్మిక నాయకుడు సత్యపాల్ రావు. |
ఓరియంట్ యాజమాన్యం నిర్మాణం చేసే నాలుగవ ప్లాంట్ ముడి సరుకు కోసం సున్నపురాయి క్వారీ కోసం ఈ నెల 15వ తేదీన దేవాపూర్ పంచాయతీ ఆవరణలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ విషయమై దేవాపూర్ ఘట్రావు పల్లె పంచాయితీ లోని గిరిజన నాయకులు ఈరోజు జిల్లా కలెక్టర్ కుఫిర్యాదు చేశారు. గత 2018 లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని అప్పుడు ఇచ్చిన హామీలు భూ నిర్వాసితులు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అమలు కాలేదని, పరిసర గ్రామాల అభివృద్ధి కార్మాగార నిర్మాణ సమయంలో స్థానికులందరికీ ఉచిత విద్య వైద్యం హామీ నెరవేరడం లేదని ఫిర్యాదు చేశారు. గతంలో తమ గ్రామాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ బదావత్ ప్రశాంత్ కు గిరిజన సంఘాల నాయకులతో పాటు ఓరియంట్ సిమెంట్ కార్మిక సంఘం నాయకుడు సత్యపాల్ రావు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. దేవాపూర్ నుండి నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాబు, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు మడవి వెంకటేష్, జిల్లా నాయకుడు కనకరాజు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
![]() |
| ఓరియంట్ ప్రజా విక్రయ సేకరణ గురించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గట్రావ్ పెళ్లి వాసులు. |
గట్రాపల్లె పంచాయతీ నుండి మాజీ సర్పంచ్ పంద్రం రాజు ఆధ్వర్యంలో ఆదివాసి సేన నాయకులు సిడం గణపతి, ప్రభాకర్, పందరం సింగులతో పాటు పంచాయతీ గిరిజన నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

