మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం. దిష్టిబొమ్మ దగ్ధం.

 కాంగ్రెస్ పార్టీలోని రెండు మండల కమిటీల ఆధ్వర్యం లో  బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం.






Scv News Kasipet:--

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అసభ్య పదజాలం తో దూషిస్తూ చెప్పుతో కొడతానని మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. కాసిపేట మండలంలో మండల కేంద్రము కొండాపూర్ చౌరస్తా, దేవాపూర్   ఓరియంట్ గేట్ ముందు కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు రత్నం ప్రదీప్, వేముల కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు బాల్క సుమన్ దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. కాసిపేట మండల కేంద్రంలో  ఎమ్మెల్యే గడ్డం వినోద్ వర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి బాల్క సుమన్  దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రత్నం ప్రదీప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన  బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలని లేకుంటే జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు.

కొండాపూర్ చౌరస్తాలో  మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గా నికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ బాల్క సుమన్ అధికారం కోల్పోవడంతో పిచ్చి పట్టి  ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించాడని అన్నారు. బాల్క సుమన్  వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను తగలబెట్టారు.

దేవాపూర్ ఓరియంట్  గేటు ముందు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు బాల్క సుమన్  దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల తీరు పట్ల  గ్రామస్థాయి కార్యకర్తలు తీవ్ర అసంతృ ప్తి.

మండల కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల నుండి రెండు వర్గాల పోరు కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు రత్నం ప్రదీప్, వేముల కృష్ణ లు లో ఎవరికి వారు యమునా తీరే అనే రీతిలో వ్యవహరిస్తుండడంతో  గ్రామస్థాయిలోని కార్యకర్తలు అయోమయానికి గురవుతు న్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో ఎవరి వెంట వెళ్లాలో అర్థం కావడం లేదు. బాల్క సుమన్ దిష్టిబోమ్మ దహనం కార్యక్రమంలో మండలంలోని మూడు చోట్ల  కాసిపేట, కొండాపూర్,దేవాపూర్ లో రెండు గ్రూపుల నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని కొంతమంది సీనియర్ నాయకులు ఇద్దరు మండలాధ్యక్షులు నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం విశేషం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు వర్గాల పార్టీ మండల కమిటీ అధ్యక్షుల వర్గ పోరు లో ఎవరి వైపు నిలవాలో తెలవక సాధారణ కార్యకర్తలతో పాటు గత 20 ఏళ్లుగా మండల రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించిన కాంగ్రెస్ నాయకులు కూడా తికమక పడుతున్నారు. పార్టీ అధిష్టాన వర్గం జోక్యం చేసుకొని  వర్గ విభేదాలు లేకుండా మండలానికి ఒకే కమిటీని నియమించి కార్యక్రమాలు పాల్గొనేలా చూడాలని కార్యకర్తలు కోరుతున్నారు.