సోమగూడెం చౌరస్తాలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం.

బాల్క సుమన్ దిష్టిబొమ్మను ఊరేగిస్తున్న సోమ గూడెం కాంగ్రెస్ నాయకులు. 
సోమగూడెం చౌరస్తాలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ తగలబెడుతున్న సోమ గూడెం కాంగ్రెస్ నాయకులు.
Scv News Kasipet:--
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అసభ్య పదజాలంతో దూషించి నందుకు నిరసనగా సోమగూడెం చౌరస్తాలో కాసిపేట మండల కాంగ్రెస్ నాయకులు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను ఈరోజు దగ్ధం చేశారు. బాల్క సుమన్ దిష్టిబొమ్మను సోమగూడెం కె పంచాయతీ నుండి సోమగూడెం చౌరస్తా వరకు డబ్బులతో ఊరేగింపుగా తీసుకువెళ్లి బాల్క సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై దగ్ధం చేశారు. ఈ కార్యక్రమం కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్, సోమ గూడెం కే మాజీ సర్పంచ్ సపాట్ శంకర్, సోమగూడెం కాంగ్రెస్ నాయకులు తోడేటి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సోమగూడెం కాంగ్రెస్ నాయకులు దాగం రాయలింగు, దుర్గం పోశం, కామెరా రాయలింగు,స్వామి ,ch శంకర్,తదితరులు పాల్గొన్నారు.