కాసిపేట యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షునిగా చిన్నాలి మధు కుమార్ యాదవ్ ఎంపిక.
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గ్రూప్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి ,బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమడుగుల మహేందర్ గార్ల ఆదేశాల మేరకు ఈరోజు చిన్నాలి మధు కుమార్ ని యూత్ కాంగ్రెస్ కాసిపేట గ్రామ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుల రాకేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ గారి చేతుల మీదుగా నియామక పత్రం అందించడం జరిగినది.
ఈ సందర్భంగా చిన్నాలి మధుకుమార్ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నన్ను కాసిపేట గ్రామ యూత్ అధ్యక్షులుగా నియమించిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ గారికి,మంచిర్యాల శాసనసభ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి,బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి,యూత్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి గారికి,యూత్ కాంగ్రెస్ బెల్లంపల్లి అసెంబ్లీ అధ్యక్షులు మహేందర్ గారికి,కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ గారికి,కాసిపేట మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి గారికి,కాసిపేట మండల మాజీ PACS చైర్మన్ పుస్కురి వంశిధర్ రావు గారికి,మరియు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుల రాకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు కొత్త రమేష్,నందికొండ శ్రీధర్,బన్న శ్రీను,వేముల నరేష్,కోడూరి విద్యాసాగర్,నవీన్,రంగ స్వరాజ్,అభి,విజయ్ తదితరులు పాల్గొన్నారు.
