మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట జూనియర్ కాలేజీలో వివేకానంద జయంతి కార్యక్రమం

 సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో  వివేకానంద జయంతి కార్యక్రమం.


 స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల సమర్పిస్తున్న సామాజిక చైతన్య వేదిక నాయకుడు కాలేజీ లెక్చరర్ లు.


Scv News Kasipet:--

 కాసిపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో జాతీయ యువజన దినోత్సవ  సందర్భంగా శుక్రవారం  స్వామి వివేకానంద 161జయంతి కార్యక్రమం  సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదట స్వామి వివేకానంద చిత్రపటానికి సామాజిక చైతన్య వేదిక నాయకులు, కాలేజీ ప్రిన్సిపాల్ లెక్చరర్లు  పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ దేశ నిర్మాణానికి మూల స్తంభాలాంటి యువతరం లో స్ఫూర్తినింపడానికి  స్వామి వివేకానంద ఎంతో కృషి చేశాడన్నారు. 'మీరు బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు. బలియామైన శక్తులమని భావిస్తే బలీయ శక్తులు గానే ఎదుగుతారు.  నిరంతర కృషితో ఉన్నత శిఖరాలకు ఎదగండి అంటూ, డబ్బు లేని వాడు పేదవాడు కాదు ఏ ఆశయం లేకుండా తిరిగే వాడే నిజమైన పేదవాడు' అంటూ  ఎన్నో ఉత్తేజకరం అయినా ప్రసంగాలు చేశారని విద్యార్థులకు గుర్తు చేశారు.

సామాజిక చైతన్య వేదిక సలహాదారు చిన్న భీమన్న మాట్లాడు తూ భారత దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలియజెప్పిన స్వామి వివేకానంద జయంతిని దేశవ్యాప్తంగా 1985 నుండి జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటు న్నామన్నారు. చికాగోలో  సర్వ మత సమ్మేళనంలో సోదరీ, సోదరీమణు లారా  అంటూ ప్రసంగం ప్రారంభించ డంతో సభ చప్పట్లతో దద్దరిల్లి పోయింది అన్నారు.

సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ  కాలేజీ యువత  స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నడుచుకుంటే ఎంతో ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు. యువత మహనీయుల జీవితాలను అధ్యయనం చేస్తూ వారు ఇచ్చిన విలువైన సూచనలను పాటిస్తే దేశానికి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా  ఉంటాయని అన్నారు.

వివేకానంద జీవితం గురించి ఇన్చార్జి ప్రిన్సిపల్ అంజనేయ  ప్రసాద్, లెక్చరర్ రమేష్  విద్యార్థులకు వివేకానందుడి జీవిత విశేషాలను  వివరించారు.  ఎకనామిక్స్ లెక్చరర్ సత్తమ్మ వివేకానందుడి గొప్పతనం గురించి వివరించి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్లు  సురేష్, చంద్రశేఖర్, చిరంజీవి, రాజేశ్వరి, సుధారాణి, భాగ్య, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.