మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో రోడ్డ చిన్న రమేష్ స్మారక వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం.

 అమరుడు రోడ్డ చిన్న రమేష్  స్మారక వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం .





Scv News Kasipet:--

 కాసిపేట మండలం దేవాపూర్ నాయకపు గూడెం క్రీడా ప్రాంగణంలో కీర్తిశేషులు అమరుడు రొడ్డ చిన్న రమేష్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఆదివాసి నాయక పోడు సేవా సంఘం దేవాపూర్ గ్రామ కమిటి ఆధ్వర్యంలో కాసిపేట మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటు ఈరోజు ప్రారంభమైంది. మొదట నాయక్ పోడ్ సేవా సంఘం గ్రామ పెద్ద మనిషి రాజన్న  రోడ్డ చిన్న రమేష్ చిత్రపటానికి  పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దేవాపూర్, మద్దిమడ సర్పంచులు అనంతరావు ఆడే జంగు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి, నాయక్ పోడ్  సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు, మండల అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్ గిరిజన సంఘాల నాయకులు తట్ర భీమారావు, రోడ్డ కిష్టయ్య, సండ్ర బాపు, రాందాస్  తదితర నాయకులు  రోడ్డచిన్న రమేష్ చిత్రపటానికి  పూలు సమర్పించారు. తదనంతరం సర్పంచులు అనంతరావు అడే జంగు, రమణారెడ్డిలు  టోర్నీని ప్రారంభించారు. ప్రారంభ మ్యాచ్ బుగ్గ గూడెం పెద్దనపల్లి జట్ల మధ్య ప్రారంభమైంది. ఈ టోర్నీలో  మండలంలోని వివిధ గ్రామాల జట్లతో పాటు తిర్యాని మండలానికి చెందిన సుమారు 16 జట్లు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా టోర్నీ  నిర్వాహకులు కొమ్ముల బాపు మాట్లాడుతూ  రోడ్డ చిన్న రమేష్ గిరిజన హక్కుల కోసం ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నాడని, ప్రజా నాయకుడిని చిరకాలం గుర్తుంచుకునే విధంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనాలన్నారు.  

మొదటి బహుమతి 5016, రూపాయలు. రెండవ బహుమతి 3016 రూపాయలు, మూడవ బహుమతి 1516 రూపాయలతో పాటు జ్ఞాపికలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.