కీర్తిశేషులు అమరుడు రోడ్డ చిన్న రమేష్ జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్.
Scv News Kasipet :--
కాసిపేట మండలం దేవాపూర్ నాయకపు గూడెం క్రీడా ప్రాంగణంలో కీర్తిశేషులు అమరుడు రొడ్డ చిన్న రమేష్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఆదివాసి నాయక పోడు సేవా సంఘం దేవాపూర్ గ్రామ కమిటి ఆధ్వర్యంలో కాసిపేట మండల స్థాయి వాలీబాల్ టో ర్ల మెంట్ నిర్వహిస్తున్నారు. ఈనెల జనవరి 13&14 2024 తేదీలలో క్రీడా పోటీలు జరుగుతాయని మొదటి బహుమతి 5016 రూపాయలు. రెండవ బహుమతి 3016 రూపాయలు, మూడవ బహుమతి 1516 రూపాయలతో పాటు జ్ఞాపికలు ఇవ్వడం జరుగుతుందని మండలంలోని క్రీడాకారులు ఉత్సాహవంతులు పాల్గొని విజయవంతం చేయగలరని ఒక ప్రకటనలో తెలిపారు .
