మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కోమటి చేనులో యువజన కాంగ్రెస్ బాధ్యుల ఎంపిక.

 ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలి.

 - కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ 

 యువజన కాంగ్రెస్ నాయకులకు నియామక పత్రాలు అందజేస్తున్న వేముల కృష్ణ.


Scv News Kasipeta:--

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రేమ్ సాగర్ రావు వర్గం  మండల అధ్యక్షులు వేముల కృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని కోమటిచేను గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాడి శంకరయ్య నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి నూతనంగా యువజన మండల సోషల్ మీడియా ఇంఛార్జి గా దుర్గం గణేష్, యువజన గ్రామ అధ్యక్షుడిగా కుమ్మరి సురేష్ నియమించారు. నియామక పత్రాన్ని యువజన మండల అధ్యక్షులు కనుకు ల రాకేష్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జిల్లా అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ నాయకత్వంలో పని చేసి గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు మాసు సుధాకర్, కొడప అనంతరావు, వెంకటేష్, శ్రీనివాస్, వేణు, ప్రసాద్, జక్కులు, రామ్ చెందర్, వినయ్, శివ ప్రసాద్, సంతోష్, ప్రేమ్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.