మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తాటి గూడ దిశ మోడల్ స్కూల్ లో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం.

 

తాటి గూడ దిశ మోడల్ స్కూల్ లో సావిత్రిబాయి పూలే  జయంతి కార్యక్రమం.

 కాజీపేట మండలం తాటిగూడ దిశ పాఠశాలలో సావిత్రిబాయి జన్మదిన కార్యక్రమం.

Scv News Kasipet:--

కాసిపేట మండల దిశ మోడల్ స్కూల్ తాటి గూడలో ఈరోజు సావిత్రిబాయి పూలే  జయంతి కార్యక్రమం  కాసిపేట మండలం ఆదివాసి సేన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివాసి సేన కమిటీ మండల అధ్యక్షుడు మాడవి వెంకటేష్  మాట్లాడుతూ సమాజంలో ఒక మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలి గా ఎదిగిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. సావిత్రి బాయి పూలే మహిళలకు విద్య బోధన, సామాజిక రుగ్మతలపై పోరాడిన వీర వనిత అని కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో ఆదివేసి సేన వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రంద్రం శంకర్, కోశాధికారి ఆత్రం సంజీవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, అంగన్వాడి టీచర్ రూప తదితరులు పాల్గొన్నారు.