గ్రామంలో త్రాగునీటి ఎద్దడి పై చర్చించిన గ్రామసభ.

సోమ గూడెం కే పంచాయతీలో నిర్వహిస్తున్న గ్రామసభ.
Scv News Kasipet:--
కాసిపేట మండలం సోమగుడెం(కే) గ్రామ పంచాయతీ లో ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ అధ్యక్షతన ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగినది.
గ్రామ సభలో సభ్యులు చర్చించి వచ్చే వార్షిక సంవత్సర ప్రణాళిక ను రూపొందించడం జరిగినది. గ్రామంలోని సమస్యల మీద చర్చించి వాటి పరిష్కార మార్గాల కోసం చర్చించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలు అందరం కలిసి కట్టుగా గ్రామ అభివృద్ధికి కృషి చేసాం అని,అలాగే రాబోయే రోజుల్లో కూడా ఊరి అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు. అలాగే రానున్నది ఎండాకాలం అని,ఊరి పక్కనే కే కే ఓసి వారు పెద్ద బోర్ వేశారని దానివల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయే అవకాశం ఉందని దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అలాగే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఓపెన్ కాస్ట్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని,ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయని,ఎప్పుడు కూలిపోతాయో అని భయ బ్రాంతులతో ఉండాల్సి వస్తుందని అన్నారు. అలాగే ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఉద్యోగo ఇవ్వలేదని,అసలు ఓపెన్ కాస్ట్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఇప్పటి వరకు సింగరేణి వారు ఒక్క అభివృద్ధి పని కూడా సోమగుడెం(కే) లో చేయలేదని,మన గ్రామాన్ని లెక్కచేయని ఓపెన్ కాస్ట్ యాజమాన్యాన్ని కూడా ఇక మీదట మనం కూడా లెక్క చేయకుండా మన హక్కుల కోసం మన ఉద్యోగాల కోసం,మన గ్రామ అభివృద్ధి కోసం పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొడగుర్ల కీర్తి,వార్డ్ సభ్యులు సపాట మల్లేష్,మల్యాల స్రవంతి,బూడిద రోజా,అంగన్వాడీ టీచర్ మారనేని సుజాత,ఆశ వర్కర్ రమ,ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్,కారోబర్ దీపక్,గ్రామ ప్రజలు కుంసోత్ పంతులు,సపాట చందు,అక్కపల్లి భాగ్య లక్మి,జాగేటి గౌరు,మల్లక్క సురేష్,పోశం,గోపే రాజయ్య,రామారావు,కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.