దేవాపూర్ లో నాయక్ పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం.
![]() |
| దేవాపూర్ నాయక్ పోడ్ గ్రామంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం. |
Scv News Kasipet :--
కా సిపేట మండల కేంద్రంలోని దేవాపూర్ పంచాయతీ పరిధిలో నాయకపు గూడ ప్రాథమిక పాఠశాలలో ఆదివాసి నాయక పోడు సేవా సంఘం కా సిపేట మండల కమిటీ ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట సావిత్రిబాయి పూలే విగ్రహానికి కార్యక్రమానికి హాజరైన నాయకు లందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.తదనంతరం సావిత్రిబాయి పూలే జీవిత విశేషాలు బడుగు బలహీన వర్గాల విద్య అందించడం కోసం అగ్రవర్ణాల కుట్రలను ఎదిరించి అవమానాలను ఎదుర్కొని విద్యను అందించిన మహా మాత అని సామాజిక రుగ్మతలను దురాచారాలను రూపుమాపాలని ఎన్నో పోరాటాలు చేసిన మహానీయురాలు అని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల బాపు ఆదివాసి నాయక పోడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సండ్ర భూమయ్య తుడుం దెబ్బ మండల అధ్యక్షులు. ఆడ జంగు మద్దిమడ సర్పంచ్. ఆత్రం జంగు తుడుం దెబ్బ గౌరవ అధ్యక్షులు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య. ముఖ్య సలహాదారు మదివేని చిన్న భీమయ్య. మంగ నారాయణ గిరిజన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. నవీన జెడ్ పి ఎస్ ఎస్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. కొమ్ముల రజిత ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి. గడ్డం శిరీష వార్డు సభ్యురాలు. రోడ్డ లక్ష్మి సోయం సూరు కార్మిక సంఘ నాయకుడు. గ్రామ పెద్దమనిషి రోడ్డ రాజం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
