గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమగుడం కె పంచాయతీ పాలకవర్గానికి సన్మానం.

సర్పంచ్ సపాట్ శంకర్ ను సన్మానిస్తున్న గ్రామస్తులు.
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని సోమవారం కే పంచాయితీలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామస్తులు పంచాయతీ పాలకవర్గ సభ్యులను శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి మాట్లాడుతూ రాజ్యాంగ యొక్క ప్రాముఖ్యత, విధి విధానాలు సమాజ పోకడలు,అభివృద్ధికి సోపానాలు దానికి రాజ్యాంగమే మూలం అంటు, భగత్ సింగ్ వంటి మహనీయుల గురించి వివరించారు. గ్రామ సర్పంచ్ సపాట్ శంకర్ మాట్లాడుతూ రాజ్యాంగO కారణంగా ఏర్పడ్డ గ్రామ పంచాయితీ లో తాను ఇన్ని రోజులు ప్రజలకు చేసిన సేవ కు కారణం రాజ్యాంగమే ముఖ్య కారణమని...గతంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఎంపీటీసీ కొండ బత్తుల రామచందర్ మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితమే గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. యువజన నాయకుడు అజ్మీర శ్రీనివాస్ మాట్లాడుతూ
పూలే, అంబేద్కర్, భగత్ సింగ్... వంటి ఎంతో మంది మహనీయుల ఆశయాల తో ఏర్పటు చేసుకున్న స్వాతంత్య్రానికి, రచించుకున్న గణతంత్ర రాజ్యం గురించి పూలే,అంబెడ్కర్, వంటి వారి కష్టాలు, వారి ఆలోచన ఆచరణ విధానాల గురించి మాట్లాడారు. వార్డు సభ్యుడు సపోర్ట్ మల్లేష్ మాట్లాడుతూ భారత దేశం లో మొదటి మహిళ ఉపాధ్యాయు రాలు సావిత్రి భాయి పూలె తాను జీవితం లో ఎదుర్కొన్న అనేక సంఘటనలు,అవమానాలు,ఎదుర్కొని మహిళలకు విద్య అందించిన సంగ సంస్కర్తలలో ఒకరు గా,మహోన్నత వ్యక్తిగా కీర్తించాలనిఅన్నారు. తదనంతరం పాలక మండలి కి ప్రజలు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో MPPS లంబడితండా స్కూల్ విద్యార్థులు,ఉపాధ్యాయులు,మరియు గ్రామ పంచాయితీ కార్యదర్శి, ఎంపీటీసీ,సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డ్ సభ్యులు,గ్రామ ప్రజలు,కో ఆప్షన్ సభ్యులు,ముల్టి పర్పస్ వర్కర్స్ వివిధ పార్టీ నాయకులు,వివిధ సంఘల నాయకులు,గ్రామ యువకులు,యూత్ నాయకులు,మహిళలు,వృద్దులు పాల్గొని పాలక మండలికి ప్రజలు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగించారు.
