అమరుడు రోడ్డ చిన్న రమేష్ స్మారక వాలీబాల్ టోర్నమెంట్ విజేత లంబడి తండా( డి )
![]() |
| రోడ్డ చిన్న రమేష్ స్మారక వాలీబాల్ టోర్నీ విజేత లంబాడి తండా డి జట్టుకు బహుమతి ప్రధానం చేస్తున్న ఎంపీపీ రోడ్డ లక్ష్మి . |
కాసిపేట మండలం దేవాపూర్ నాయకపు గూడెం క్రీడా ప్రాంగణంలో కీర్తిశేషులు అమరుడు రొడ్డ చిన్న రమేష్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఆదివాసి నాయక పోడు సేవా సంఘం దేవాపూర్ గ్రామ కమిటి ఆధ్వర్యంలో కాసిపేట మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటు గత రెండు రోజులుగా నిర్వహించారు. ఈరోజు నిర్వహించిన సెమీఫైనల్ ఫైనల్ పోటీలో టోర్నీ విజేతగా లంబడి తండా డి టీం నిలిచింది. ఫైనల్ లో రాంపూర్ జట్టుపై గెలుపొంది ప్రథమ బహుమతి గెలుచుకుంది . రాంపూర్ జట్టు ద్వితీయ బహుమతి గెలుచుకోగా తృతీయ బహుమతికి జరిగిన పోటీలో రాంపూర్ బి టీం పై తిర్యాని జట్టు గెలుపొంది ద్వితీయ బహుమతి గెలుచుకుంది.
బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన కాసిపేట ఎంపిపి రోడ్డ లక్ష్మి మాట్లాడుతూ రోడ్డ చిన్న రమేష్ స్మారక వాలీబాల్ టోర్నమెంటులో మండలంలోని యువకులంతా ఉత్సాహంగా పాల్గొని అద్భుతంగా ఆడారని అన్నారు. యువకులు క్రీడలతో పాటు విద్యపై కూడా శ్రద్ధ చూపాలని అన్నారు. పౌర హక్కుల సంఘం నేత శ్రీమన్నారాయణ మాట్లాడుతూ కాసిపేట మండలంలో వాలీబాల్ క్రీడాకారులు ఎంతో అద్భుతంగా వాలిబాల్ ఆడుతున్నారని జిల్లా అధికారులు వాలీబాల్ క్రీడా నైపుణ్యత పెంపొందించేందుకు వాలీబాల్ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. వెనుకబడ్డ ప్రాంతమైన ఆదివాసీ గూడాల నుండి వచ్చిన క్రీడాకారులు క్రీడలతో పాటు చదువులపై కూడా శ్రద్ధ పెట్టి ఉపాధి మార్గాలు చూసుకోవాలన్నారు. మధ్యలో ఆగిన చదువులను కొనసాగించేందుకు ఓపన్ యూనివర్సిటీల ద్వారా డిగ్రీలు సంపాదించుకోవాలని సూచించారు.
మద్దిమడ సర్పంచ్ అడే జంగు మాట్లాడుతూ రోడ్డ చిన్నా రమేష్ మండలంలో జరిగిన ఆదివాసి హక్కుల కోసం జరిగిన ఉద్యమాలతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న డన్నారు. అతని స్మారకార్థం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. సమావేశంలో జిల్లా తుడుం దెబ్బ నాయకులు హనుమంతు, అనంతరావు ఆదివాసి విద్యార్థి సంఘం వెడ్మ కిషన్ రోడ్డ చిన్న రమేష్ ఆదివాసి ఉద్యమాలకు చేసిన సేవలు గురించి మాట్లాడారు.
వాలీబాల్ పోటీల నిర్వాకుడు కొమ్ముల బాపు మాట్లాడుతూ రోడ్డ చిన్న రమేష్ తన కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం గిరిజన హా క్కుల కోసం ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నాడని అతడి సేవలను గుర్తుంచుకునేందుకు స్మారక వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించామన్నారు. రెండు రోజులుగా వాలీబాల్ పోటీలలో పాల్గొని విజయవంతం చేసిన క్రీడాకారులకు ఆదివాసి సంఘాల నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తదనంతరం విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. టోర్నీ విజేత లంబాడి తండా డి టీంకు 5016 నగదు తో పాటు ట్రోఫీని అందజేసారు. రన్నర్ ఆఫ్ గా నిలిచిన రాంపూర్ జట్టుకు 3016 నగదుతో పాటు ట్రోపీ ని అందజేశారు. తృతీయ స్థానంలో నిలిచిన తిర్యానిజట్టుకు 1516 నగదు తో పాటు జ్ఞాపికను అందజేశారు. టోర్నీలో అత్యంత ప్రతిభ చూపిన రాంపూర్ వాలీబాల్ సభ్యుడికి బెస్ట్ ఫర్ ఫార్మర్ అవార్డు అందజేశారు. క్రీడా పోటీలను ఆడిపించిన రిఫరీలు శంకర్, బద్ది శ్రీనివాస్ లకు మెమొంటోళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు గిరిజన సంఘాల నాయకులు సూరు, రాందాస్, మాజీ సర్పంచ్ రోడ్డరమేష్, ఆత్రం జంగు తదితరులు పాల్గొన్నారు.

