గాంధారి ఖిలాలో పుష్యమాస పౌర్ణమి వేడుకలు.

గాంధారి ఖిల్లా పుష్య మాస పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కాసిపేట మండల ఆదివాసి సేన నాయకులు.
Scv News Kasipet:--
మంచిర్యాల జిల్లా గాంధారి ఖిలాలో పుష్య మాస పౌర్ణమి వేడుకల సందర్భంగా కోవామికాసి వంశీయులు గత రెండు రోజులుగా నిర్వహించి ఈరోజు ముగించారు. ఈ వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా గిరిజనులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోవా మీకాశి వంశస్తులతోపాటు కోవామికాసి రాష్ట్ర సంక్షేమ సంఘం నాయకుడు కోవాదేవరావు, కోవా పార్వతి బాయ్, ఆదివాసి సేన రాష్ట్ర అధ్యక్షులు కోవదౌలత్ రావు, జిల్లా అధ్యక్షుడు కోట్నాక తిరుపతి, కాసిపేట మండల అధ్యక్షుడు మడావి వెంకటేష్, రాయి సెంటర్ సర్ మేడి మిశ్రమ్ మాదు, సిడం జంగు, కొడప అనంతరావు, మడావి గంగారం, పెద్రం శంకర్ తదితరులు పాల్గొన్నారు.