మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ప్రజా పాలన గ్రామసభలకు ప్రజల్లో అపూర్వ స్పందన.

 ప్రజా పాలన గ్రామసభలకు ప్రజల్లో అపూర్వ స్పందన.

- కాసిపేట  మండలంలో 8,000 మంది దరఖాస్తు 

- ప్రజా పాలన గ్రామసభలకు మండల ప్రజా ప్రతినిధులు డుమ్మా.

 - అధికార పార్టీ నాయకులే ప్రజాప్రతినిధులుగా హల్ చల్.

 ప్రభుత్వ నిబంధనలపై  అవగాహన లేని రాజకీయ నాయకులు.



Scv News Kasipet:--

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం తర్వాత గత పదేళ్లలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్  ప్రభుత్వం  గ్రామీణ ప్రాంతాలలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏనాడు గ్రామసభలు నిర్వహించ లేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లోప్రజా పాలన గ్రామసభలు నిర్వహిస్తుండడంతో  ప్రజల్లో అపూర్వ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది, కాసిపేట మండలంలో 8000 మంది  6 గ్యారంటీ ల కోసం దరఖాస్తు చేసుకోవడం దీనికి ప్రత్యేక నిదర్శనం. తెలంగాణలో గత పదేళ్లలో బంగారు తెలంగాణ గా మార్చామన్న  బిఆర్ఎస్ నాయకుల ప్రచారం వట్టి బూటకం అని  గ్రామసభల ద్వారా తేలింది.  కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల వాగ్దానం లో భాగంగా 6 గ్యారంటీల పథకాల కోసం రాష్ట్రంలోని వివిధ గ్రామాల లో నిర్వహించే ప్రజా పాలన గ్రామసభలలో లక్షలాదిమంది ప్రజలు  హాజరై తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. గ్రామ సభలు   సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించా రు.ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ కోసం మండల తహసిల్దార్, ఎంపీడీవోల బృందాలు  హాజరై ప్రజల నుండి దరఖాస్తుల నుస్వీకరించాయి.

 ప్రజా పాలన గ్రామసభలకు హాజరుకాని మండల ప్రజా ప్రతినిధులు.

 అప్పటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కార్యక్రమంలో పాల్గొన్న  మండల ప్రజా ప్రతినిధులు ఎంపీపీ రోడ్డ లక్ష్మీ జెడ్పిటిసి పల్లె చంద్రయ్య ( పాత చిత్రం)

ఈ గ్రామ సభలకు పార్టీలతో సంబంధం లేకుండా మండల  ప్రజా ప్రతినిధులు తప్పకుండా హాజరు కావాల్సి ఉంది. మండల పరిషత్ అధ్యక్షురాలు, జెడ్ పి టి సిలు, ఎంపీటీసీలు విధిగా హాజరై ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవా ల్సి ఉంది. కాసిపేట మండలంలో గత వారం రోజులుగా  జరిగిన ప్రజా పాలన గ్రామసభలలో  మండల ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జెడ్పిటిసి పల్లె చంద్రయ్యలు హాజరు కాకుండా డుమ్మా కొట్టడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జడ్పిటిసి పల్లె చంద్రయ్య తమ స్వగ్రామం పెద్దనపల్లి  పంచాయతీలో జరిగిన గ్రామసభలో మాత్రమే హాజరయ్యారు. మిగతా గ్రామాలలో జరిగిన ప్రజాపాలన గ్రామసభల్లో హాజరు కాలేదు.

 గ్రామ సభలో అధికార పార్టీ నాయకుడి హల్ చల్.

 ప్రజా పాలన గ్రామసభలో నిబంధనలకు విరుద్ధంగా తాసిల్దార్ తో ప్రజలనుండి దరఖాస్తు స్వీకరిస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్.
మరోవైపు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రతి గ్రామ సభకు హాజరయ్యారు. కొంత మంది నాయకులు అత్యుత్సాహాన్ని చూపిస్తూ  ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రామ సభలలో  అధికార వేదికలపై కూర్చుని  ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తూ అధికారుల కు సూచనలు ఇవ్వడం పట్ల కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ గ్రామ సభలో హల్చల్ చేస్తూ ఏకంగా అధికారుల పక్కనే కూర్చుని ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి  ప్రభుత్వ నిర్ణయాలపై అధికారిక వేదికలపై కూర్చుని  ప్రజలకు పలు వాగ్దానాలు చేయడం మాట్లాడడం పట్ల అధికారులకు ఇబ్బందులు కలిగించారు.నాయకుల అతి చేష్టలు  ప్రజలకు కూడా అసౌకర్యానికి గురిచేసింది.

 రాజకీయ నాయకులకు అవగాహన లేకనే అత్యుత్సాహం.

టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో రాజకీయ నాయకులుగా చలామణి అయ్యే నాయకులకు  రాజ్యాంగంలోని హక్కులు, ప్రభుత్వ నిబంధనల పై అవగాహన లేకపోవడం వల్లనే ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తు అత్యుత్సాహా లను ప్రదర్శిస్తున్నారనే  విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వ నిబంధనల వరకు ప్రకారం ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధు లు పార్టీలతో సంబంధం లేకుండా ఆయా గ్రామాలలో  ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే గ్రామ సభలలో తప్పకుండా పాల్గొనాలి. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మయ్యేందుకు తమ వంతుగా కృషి చేయాలి. ప్రజల కట్టే పన్నుల నుండే మండల ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం గౌరవ వేతనాలు చెల్లిస్తుంది. తమను గెలిపించిన పార్టీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న కూడా ప్రజల తరఫున గ్రామసభలలో పాల్గొనాలానే సోయి మండల ప్రజా ప్రతినిధులకు ఉండాలి.

మరోవైపు అధికారంలోకి వచ్చిన పార్టీ నాయకులు కూడా  పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించే అధికారిక కార్యక్రమాలలో ప్రభుత్వ అధికారుల పక్కన గ్రామ సభలలో వేదికల మీద కూర్చుని , ప్రజల నుండి ఫిర్యాదు లను స్వీకరించే అర్హత కూడా లేదు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఆయా గ్రామాల  ప్రజల తరఫున అధికారులకు వారి సమస్యలను విన్నవించి పరిష్కరించా లని కోరే అధికారం ఉంది. ఇలా చేస్తే ఎవరికీ ఏ సమస్య ఉండదు. ఇది అధికార పార్టీ నాయకులు తెలుసుకోవాలి.

 గత బిఆర్ఎస్ పాలన దుష్ఫలితాలు.

 ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పంచాల్సిన బతుకమ్మ చీరలను పార్టీ నాయకులు ప్రజలకు పంచుతున్న పాత చిత్రం 

తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ సాగించిన దుష్ట పరిపాలన సాంప్రదా యం నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా అనుసరిస్తున్నారు. బారాస నియంతృత్వ పాలనలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా  ప్రజాస్వా మ్యం ఖూనీ అయింది. రాష్ట్రంలో, జిల్లాలలో, మండలాలలో పరిపాలన యంత్రాంగం అంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని చేయకుండా ఆటంకాలు కల్పించడం వల్లనే నాయకులకు ఎవరు ఏ పని చేయాలని అవగాహన లేకుండా పోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను అధికారపక్షం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు ప్రతిపక్ష పాత్ర అనేది అత్యంత కీలకం. తెలంగాణలో  ప్రజల పక్షాన మాట్లాడేందుకు ప్రతిపక్షాన్నే లేకుండా విపక్షాల తరుపున గెలిచిన ప్రజాప్రతి నిధులందరిని కూడా  తమ పార్టీలో కలుపుకొని నియంతృత్వ పాలన సాగించారు. వివిధ గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై  మండల సభలో, గ్రామసభల్లో ప్రజల తరఫున ఎవరైనా అధికార పక్షం నుండి  ప్రజా ప్రతినిధి అధికారులను ప్రశ్నిస్తే తమ పార్టీలో ఉండి తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా ప్రశ్నిస్తాన్ అంటూ వారి నోర్లు మూయించారు. గత బి ఆర్ ఎస్  ప్రభుత్వ హాయంలో మండల అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు ఒకరు  గ్రామాలలో ప్రజలు రహదారులు, మంచినీటి కోసం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై ప్రజా ప్రతినిధులు నాయకులు  పత్రికలలో,వాట్సాప్ గ్రూపులు ఏవైనా పోస్టింగ్లు పెడితే మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా పెట్టారంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యే మండల పర్యటకు వస్తే నాయకులంతా ఆయన వెంటే గ్రామాలలో తిరుగుతూ కనీసం ప్రజా సమస్యలను కూడా పట్టించు కునేవారు కాదు. ఎమ్మెల్యే కూడా మండల ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్ల మాటలకు విలువ ఇవ్వకుండా మండల పార్టీ నాయకుడి మాటలకే ప్రాధాన్యత నిచ్చేవాడనే విమర్శలు. అదే దుష్ట సాంప్రదాయం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగడం వల్లనే పార్టీ మండల అధ్యక్షుడు ప్రజా ప్రతినిధుల కంటే తానే గొప్ప అనే రీతిలో వ్యవహరి స్తున్నాడనే  వాదనలు ఉన్నాయి.

అధికారపార్టీలో  మండల నాయకులు గా చలామణి అయేవారు ఇతరుల విమర్శలకు తావివ్వకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులను ,ప్రజాప్రతినిధులను సమన్వయ పరుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూసే బాధ్యత ఉంది. మండల పార్టీలో కూడా విభేదాలు రాకుండా సీనియర్ నాయకులను మాజీ ప్రజాప్రతినిధుల ను కలుపుకొని వారి అనుభవాలతో ప్రజా సమస్యలు, మండల అభివృద్ధిపై  అంతర్గతంగా చర్చించుకుని ముందుకు వెళ్లాలి.

 ఇలా వెళ్తేనే మండల రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుంది.ఈ విషయాలపై అధికార పార్టీ ముఖ్య నాయకులు దృష్టి సారించాలని మండల  ప్రజల తరఫున సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా 'Scv News ' సూచిస్తుంది.