కేకే ఓసి లో పనులు కల్పించాలని ముప్పు గ్రామం దుబ్బ గూడెం గ్రామ యువకుల వినతి.

కేకే ఓసి లో పనులు కల్పించాలని సింగరేణి యాజమాన్యం పంపు పనులను నిలిపిన దుబ్బగూడం యువకులు.
Scv News Kasipet:--
మందమరి ఏరియా కేకే ఓ సి ముంపు గ్రామమైన కాసిపేట పంచాయతీ పరిధిలోని దుబ్బగూడం గ్రామ యువకులు సింగరేణి యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు. ముప్పు గ్రామ యువకులకు కేకే ఓసి లో ఉద్యోగాలు ఇప్పిస్తామని గత రెండు సంవత్సరాల కింద ఒప్పుకొని పనులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పనులు కల్పించకుంటే కేకే ఓసి పనులను అడ్డుకుంటామని ఈరోజు దుబ్బగూడా గ్రామ సమీపంలోని పనులను ఆపమని తెలిపారు. మందమర్రి జిఎం జోక్యం చేసుకొని తమకు వెంటనే పనులు కల్పించాలని లేకుంటే ఓసి పనులను అడ్డుకొని ఆందోళన చేస్తామని హెచ్చరించారు.