మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట ఆదర్శ పాఠశాలలో ఇంపాక్ట్ ట్రై నర్ అర్జున్ మోటివేషన్ క్లాస్.

 విద్యార్థులు లక్ష్యం పెట్టుకుని చదువుతూనే విజయం సాధిస్తారు.

-- ఇంపాక్ట్ ట్రైనర్ మద్దినేని అర్జున్.


 ఆదర్శ పాఠశాలలో ఇంపాక్ట్ ట్రైలర్ మద్దినేని అర్జున్' పరీక్షల్లో ఎలా విజయం సాధించాలనే 'అంశంపై మోటివేషన్ క్లాస్.

 

Scv News Kasipet:--

 విద్యార్థులు తాము విజయం సాధించాలంటే లక్ష్యం పెట్టుకుని చదువుకోవాలని అప్పుడే విజయం మీ సొంతం అవుతుందని ఇంపాక్ట్ ట్రైనర్ మద్దినేని అర్జున్ అన్నారు. ఈరోజు కాసిపేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ' ' పరీక్షలలో విజయం సాధించడం ఎలా? ' అనే అంశంపై విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

 జీవితంలో విజయం సాధించాలంటే ముందు లక్ష్యం పెట్టుకోవాలని,దాని కనుగుణంగా చదువుతూ సమయం వృధా చేయకుండా చూసుకోవాలని అన్నారు. పరీక్షలకు ముందు విద్యార్థులు మూస పద్ధతిలో చదవకుండా 'పొలడారో 'పద్ధతిలో చదవాలని పలు టెక్నిక్లు వివరించారు. పేదరికము చదువుకు అడ్డు రాదని దేశంలో వివిధ రాష్ట్రాలలో అత్యంత పేదరికంలో ఉండి ఐఏఎస్ అధికారులుగా ఎన్నికైన వారి గురించి విద్యార్థులకు వివరించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని రెబ్బన మండలానికి చెందిన పేద కుటుంబం నుండి ఐఏఎస్ గా ఎన్నికైన రేవయ్య గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి చదువు పై నిర్లక్ష్యం చేయకుండా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మనసుపెట్టి చదివి కష్టపడితేనే సాధ్యమవుతుందని అన్నారు.

పాఠశాల ప్రిన్సిపాల్ అందే నాగ మల్లయ్య మాట్లాడుతూ పరీక్షలకు ముందు విద్యార్థులకు చదువుపై మంచి అవగాహన కల్పించిన అర్జున్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులంతా అర్జున్ గారు చెప్పిన సూచనలను పాటించి వాటిని చదువుతోపాటు జీవితంలో అమలు చేసి సక్సెస్ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.