మండల గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన ఆదివాసి సేనా కమిటీ నాయకులు.
Scv News Kasipet:--
![]() |
| బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోదును శాలువాతో సన్మానిస్తున్న ఆదివాసి సేన కమిటీ నాయకులు. |
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ నివాసంలో ఈరోజు కాసిపేట మండల ఆదివాసి సేన కమిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతనం గా బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా వినోద్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆదివాసి సేన మండల కమిటీ అధ్యక్షుడు మడావి వెంకటేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ తో కలిసి మండలంలోని వివిధ గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే వినోద్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన కమిటీ గౌరవ అధ్యక్షులు మడావిగంగా రాం,వర్కింగ్ ప్రెసిడెంట్ పెంద్రం శంకర్, ఉపాధ్యక్షుడు పెంద్రం ప్రభాకర్, కోశాధికారి ఆత్రం సంజీవ్, సలహాదారుడు కుర్సింగ ఇస్రు తదితరులు పాల్గొన్నారు.
