స్థానిక కార్పెంటర్లతోటే పనులు చేయించుకోవాలని వినతి.
![]() |
| కొండాపూర్ లో సమావేశమైన మండల విశ్వబ్రాహ్మణ కమిటీ. |
Scv News Kasipet:--
కాసిపేట మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు యాప సెంటర్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలలో వడ్రంగులు చేసే పనులను స్థానికులతోనే చేయించుకోవాలని వినియోగదారులను కోరారు.
మండలంలో ఇతర ప్రాంతాల కార్పెంటర్లు వచ్చి పనిచేయడం వల్ల స్థానిక కార్పెంటర్లకి పని కోల్పోవడం జరుగుతుందనిలోకల్ లో ఉన్న వృత్తిదారులు పని కోల్పోయి ఏలాంటి ఉపాధి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి అన్నారు. మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజేందర్ చార్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్పెంటర్ వర్కర్ కి లేబర్ కార్డు అప్లై చేసుకోవాలని అతి త్వరలో లేబర్ ఆఫీసర్ తో మాట్లాడి క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
సమావేశంలో మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ చార్యులు రాష్ట్ర కార్యదర్శి సీలోజు మురళి చార్యులు, శ్రీనివాస్ ,ప్రభాకర్ నాగభూషణం,శంకర్, రాజేందర్ బాపు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
