కాసిపేటలో బీమా కోరేగాం అమరవీరుల విజయ దివాస్ వేడుకలు.


కాసిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బీమా కోరగావ్ విజయ్ దివాస్ కార్యక్రమం.
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బీమా కోరేగావ్ విజయ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం మండల కన్వీనర్ జాడి పోశం సంఘ నాయకు లు బీమా కోరేగాం అమరవీరుల స్మారక స్తూప చిత్ర పటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీమా కోరేగాం అమరవీరుల జీవిత చరిత్ర గురించి తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట సత్యం మాట్లాడుతూ మహార్ వీరుల పోరాట చరిత్రను బహుజన వర్గాలమంత తెలుసు కోవాలన్నా రు. వారి పోరాట స్ఫూర్తితో బహుజన వర్గాలు తమ హక్కుల కోసం పోరాడాలన్నారు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ మహార్ పోరాట వీరుల చరిత్ర 1921లో బాబాసాహెబ్ అంబేద్కర్ బాహ్య ప్రపంచానికి తెలియజేశాడన్నారు. బీమా కోరేగావ్ విజయ స్తూపాన్ని సందర్శించి ఈ దేశ బహుజన వర్గం అంతా ప్రతి ఏట విజయ దివాస్ జరుపుకోవాలని పిలుపునిచ్చారన్నారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ అంటరాని కులాలకు చెందిన మహావీరులు 500 మంది వేలాది బ్రాహ్మణ పీస్వ సైన్యాన్ని ఓడించడం ఎంతో గర్వకారణం అన్నారు. అంబేద్కర్ సంఘం మండల నాయకుడు దాసరి రాజన్న మాట్లాడుతూ భీమా కోరేగాం అమరవీరుల విజయ దివాసి జరుపుకోకుండ బహుజన వర్గాలు నూతన సంవత్సర సందర్భంగా మందు విందులతో జల్సాలు చేయడం విచారకరమన్నారు.
ఈ కార్యక్రమంలో టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్, సిపిఐ మండల నాయకుడు పులి శంకర్,అంబేద్కర్ సంఘం మండల నాయకులు లంక లక్ష్మణ్, దాసరి రామచందర్, భవన కార్మిక సంఘం మండల నాయకులు ఉప్పులేటి మధునయ్య, కురుమ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.