దేవాపూర్ నాయకపు గూడలో ప్రొఫెసర్ హైమాన్ డార్ఫ్ 37వ వర్ధంతి.
![]() |
| దేవాపూర్ నాయకపు గూడా పాఠశాలలో హైమాన్ డార్ఫ్ |
Scv News Kasipet:--
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల దేవాపూర్ పంచాయతీ పరిధిలోగల నాయకపూగూడా ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివాసి నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీల ఆత్మబంధువు మానవ పరిమాణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ 37వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయక్ పోడ్ సేవ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ కొమరం భీమ్ ఉద్యమం మరణాంతరం తరువాత నిజాం సర్కార్ ఆదేశాల మేరకు ఆస్ట్రియా దేశం నుండి హైమన్ డార్పు దంపతులు ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి రావడం జరిగింది ఆదివాసుల జీవన విధానం పై సంస్కృతి సాంప్రదాయాలను భూమి అడవి నీటిపై పూర్తి అధికారాలు ఆదివాసీలకు ఉండాలని అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసి ప్రాంతాలను తిరిగి వారి జీవన విధానాలపై సంస్కృతి సాంప్రదాయాలపై పరిశోధన చేసి నిజాం సర్కారుకు నివేదికను పంపించడం జరిగింది. దాని ఫలితంగా ఆదివాసీలకు ఐటిడిఏ కెస్లాపూర్ జాతర దర్బార్ 1/70 చట్టం ఇలాంటి ఎన్నో రిజర్వేషన్లను కల్పించారని ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. కొమ్ముల రజిత ఎస్ఎఫ్ఐ జల్లా సహాయక కార్యదర్శి. నవీన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు. కొమ్ముల సంజీవ్ విద్యార్థులు పాల్గొన్నారు..
