మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవం.

 కాసిపేట మండలంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవం.

 కాసిపేట మండల తాహాసిల్దార్ కార్యాలయం వద్ద జెండా ఎగరవేస్తున్న తహసిల్దార్ భోజన్న.


 మండలంలోని వివిధ గ్రామాలలో గణతంత్ర వేడుకల దృశ్యాలు.


Scv News Kasipet:--

మంచిర్యాల జిల్లా  కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఈరోజు 74 వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఎంఏ అలీ, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ భోజన్న, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ బడావత్ నీల , జాతీయ జెండాను ఎగరవేశారు.

కాసిపేట పోలీస్ స్టేషన్ లో ఎస్సై గంగారాం, దేవాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై, ఆంజనేయులు, కాసిపేట ప్రెస్ క్లబ్ లో  అధ్యక్షుడు నజీర్, అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం కన్వీనర్ జాడి పోశం, ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్, దేవాపూర్ ఓరియంటల్ లారీ యార్డులో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వడ్లూరు మల్లేష్, చిన్న ధర్మారం గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు సూరం సంపత్  అంబేద్కర్ భవన్లో  అంబేద్కర్ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు గసికంటి మల్లేష్ లు  జాతీయ జెండాలను ఎగురవేశారు.

కాసిపేట ఒకటి గని వద్ద గని మేనేజర్ అల్లావుద్దీన్, కాసిపేట టు గని వద్ద గని మేనేజర్ గొడిసెల లక్ష్మీనారాయణ, గ్రామపంచాయతీ కార్యాలయాలలో గ్రామ కార్యదర్శులు, ప్రభుత్వం పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆదర్శ పాఠశాల  పాఠశాల విద్యార్థులు రిపబ్లిక్ డే సందర్భంగా పాఠశాల నుండి మండల కేంద్రం వరకు ఊరేగింపులు నిర్వహించారు.

కాసిపేట మండల కేంద్రంలోని విస్డం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని అలరించాయి. గట్రావుపల్లి, సోమగూడెం కె గ్రామ పంచాయతీలలో ఈ నెలాఖరులోగా పాలకవర్గాల కడువు ముగుస్తున్న సందర్భంగా సర్పంచులు వార్డు సభ్యులను గ్రామస్తులు సన్మానించారు.

 రిపబ్లిక్ డే సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రం రావు, కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, మండల కాంగ్రెస్ నాయకులు రాపర్తి శ్రీనివాస్ నర్సింగ్, అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జి బన్న లక్ష్మణ్ దాస్, సిపిఐ మండల కార్యదర్శి దాగం మల్లేష్ సామాజిక చైతన్య వేదిక సలహాదారులు మద్దినేని చిన్న భీమయ్య వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.