మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దుబ్బగూడెం లే అవుట్ కాలనీలో ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.

 దుబ్బగూడెం లే అవుట్ కాలనీలో ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి  ఎమ్మెల్యే  గడ్డం వినోద్.



 దుబ్బగూడం ఆంజనేయ స్వామి దేవాలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ జెడ్పిటిసి కారుకురి రామచందర్, మండల పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్.


Scv News Kasipet:--

 కాసిపేట మండలం దుబ్బ గూడెం  లేఅవుట్ కాలనీలో ఈరోజు ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి  బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్యఅతిథిగా హాజరయి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.  దుబ్బగూడం వాసులు పూలమాలలు శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి లేఅవుట్ కాలనీ పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. లేఔట్ కాలనీలో ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాసిపేట సర్పంచ్ ధరావత్ దేవి బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరు రాంచందర్ , కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్నం ప్రదీప్, బెల్లంపల్లి మండల కాంగ్రెస్ నాయకులు దుర్గం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.