ధర్మారావుపేట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గోపు శ్రీనివాస్ ఎన్నిక.
![]() |
| ధర్మ రావు పేట గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన గోపు శ్రీనివాస్. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామంలో ఈరోజు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు గ్రామ కమిటీని ఎంపిక చేసామని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేముల కృష్ణ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎంపిక వేముల కృష్ణ ,ఎంపీటీసీ పార్వతి మల్లేష్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటి అధ్యక్షులుగా గోపు శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా చొప్పదండి గట్టయ్య, గుమ్ముల నరేష్, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల శంకరయ్య ప్రచార కార్యదర్శి బాణాల చారి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జంగిలి రమేష్ యాదవ్ ,చెన్నవేని చంద్రయ్య నేరేళ్ల రవి,తన్నీరు మహేష్,తదితరులు పాల్గొన్నారు.
