ముత్యం పల్లి గ్రౌండ్ అభివృద్ధికి సి ఎస్ ఆర్ నిధులు విడుదల చేయాలని వినతి.
- సానుకూలంగా స్పందించి మందమర్రి జిఎం కు ఫార్వర్డ్ చేసిన బలరాం.
- మండల సమస్యలను సింగరేణి ఎండి దృష్టికి తీసుకువెళ్లను రత్నం ప్రదీప్ కు మండల వాసులు అభినందనలు.
సింగరేణి ఎండీ బలరాం ను కలిసి వినతి పత్రం అందజేస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్.
| Scv News Kasipet :-- |
కాసిపేట మండల పరిసర గ్రామాలన్నీ సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలతో ప్రభావిత గ్రామాలుగా ఏర్పడి ఎన్నో సమస్యలతో తల్లడిల్లుతున్నాయి. సింగరేణి యాజమాన్యం గనుల తవ్వకాలు చేస్తున్న కాసిపేట,ముత్యం పల్లి, చిన్న ధర్మారం గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. సింగరేణి వచ్చే లాభాలలో ప్రతి ఏటా కోట్లాది నిధుల సి ఎస్ ఆర్ సామాజిక అభివృద్ధి నిధులు అవుతున్న వేరే ప్రాంతాలకు తరలి వెళుతున్నాయి. గత టిఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో సింగరేణి సి ఎస్ ఆర్ నిధులు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలకు తరలి పోయిన సందర్భాలు ఉన్నాయి. కాసిపేట మండల పరిధిలో రెండు భూగర్భ గనులు, ఒక ఓపెన్ కాస్ట్ గని ప్రస్తుతం ఉత్పత్తి తీస్తున్నాయి. గత టిఆర్ఎస్ పాలకులు తమ స్వార్థం కోసం సింగరేణి అధికారులతో లాలూచీపడి పైరవీలు చేసుకొని బ్రతకారే తప్ప ఏ రోజు ఈ ప్రాంత గ్రామాల అభివృద్ధికి నిరుద్యోగ యువకులకు ఉపాధి గురించి సింగరేణి అధికారులతో మాట్లాడింది లేదు. ఓపెన్ కాస్ట్ లో ఉద్యోగాలు పెట్టిస్తామని మండల టిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు నిరుపేద యువకులకు వద్ద వేలాది రూపాయలు వసూలు చేసుకుని వాడుకున్నా సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సింగరేణిలో పరిస్థితులు మారిపోయాయి. ఓపెన్ కాస్ట్ గనులలో స్థానిక యువకులకి ఉపాధి కల్పించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. దీనికి ముఖ్యమంత్రి స్పందించి 80% స్థానిక యువకులకు ఓపెన్ కాస్ట్ లో పనులు కల్పించాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక యువతను ఓపెన్ కాస్ట్ లో తీసుకునే కసరత్తు నడుస్తుంది.
కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ ఆదేశాల మేరకు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ను ఈరోజు హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిమండల సమస్యలను ఆయన దృష్టి కి తీసుకు వెళ్లడం పట్ల మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాసిపేట మండలంలో రెండు భూగర్భ గనులు ఓపెన్ కాస్ట్ గనితోపాటు సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. సింగరేణి పరిసర గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చొరవ చూపడం లేదని కాసిపేట మండలాన్ని CSR నిధులతో అభివృద్ధి చేయాలని, ముత్యంపల్లి లోని గ్రౌండ్ ను అభివృద్ధి చేస్తూ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు గ్రంధాలయం ఏర్పాటు చేసి అన్ని రకాల సదుపాయ లు కల్పించాలని సీ అండ్ ఎండి బలరాంకు వినతిపత్రం అందజేశారు. బలరాం వెంటనే సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం కోసం మందమరి GM గారికి ఫార్వర్డ్ చేసి పరిష్కరించేందుకు హామీ ఇచ్చాడని రత్నం ప్రదీప్ ఒక ప్రకటనలో తెలిపారు.
ముత్యం పెళ్లి గ్రౌండ్లో ఓపెన్ జిమ్ మంజూరు చేయిస్తానని గత మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎన్నోసార్లు వాగ్దానం చేశాడు తప్ప మంజూరు చేయించలేదు. సింగరేణి యాజమాన్యంతో సానుకూలంగా వ్యవహరిస్తూ బొగ్గు గనుల పరిసర గ్రామాల అభివృద్ధి కోసం మినరల్ ఫండ్ ను విడుదలకు స్థానిక ఎమ్మెల్యే వినోద్ కృషి చేయాలని మండల వాసులు కోరుతున్నారు. స్థానిక గ్రామాల అభివృద్ధి విషయమై ముత్యం పల్లి గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ కు సి ఎస్ ఆర్ నిధులు విడుదల చేయాలని సింగరేణి ఎండి బలరామ్ ను కలిసి వినతి పత్రం ఇచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ను మండల ప్రజల తరఫున scv News అభినందిస్తుంది. ప్రజల కోసం గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులకు మాత్రమే ప్రజల్లో మంచి పేరు ఉంటుంది . కాబట్టి ప్రజా పాలనను అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అభివృద్ధి కోసం కృషి చేయాలని మండల వాసులు కోరుతున్నారు.
