మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ( BSI) మాంచేరియాల్ జిల్లా క మిటి ఎంపిక.

 బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ( BSI) మాంచేరియాల్ జిల్లా అధ్యక్షునిగా కే.యుగంధర్ సాయి ఎన్నిక.

 బిఎస్ఐ జిల్లా  కమిటీ అధ్యక్షుడుగా యుగంధర్ సాయికి నియామక పత్రం అందజేస్తున్న  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పరందాములు. 
Scv News Kasipet:--

 బాబా సాహెబ్ అంబేద్కర్ బహుజన వర్గాలకు ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం ఏర్పాటు చేసిన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా( BSI ) మంచిర్యాల జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్ క్లబ్ జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా  బి ఎస్ ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పరంధాములు, ఉపాధ్యక్షులు బి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి శీలం ప్రభాకర్ హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి  వీరు మాట్లాడుతూ  ఈరోజు దేశంలో మనువాద బ్రాహ్మణ వర్గం హిందూ మతం పేరిట భావోద్వేగాల రెచ్చగొడుతూ  బహుజన వర్గాలను, మైనార్టీ వర్గాలపై దాడులు చేస్తుందన్నారు. హిందూ మతోన్మాదుల హింస దౌర్జన్యాలను ఎదుర్కోవాలంటే, శాంతియుత పద్ధతిలో  ప్రేమ,కరుణ దయాలను బోధించిన బౌద్ధమే ప్రత్యామ్నాయ మన్నారు. దేశంలోని బహుజన వర్గాలు అసమానతలతో కూడిన కుల వ్యవస్థ ఉన్న  హిందూ మతాన్ని వీడి కుల మతాలు లేని స్వేచ్ఛ,స్వాతంత్రం సమానత్వాన్ని అందించే బౌద్ధంలో చేరాలని బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారన్నారు. దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన బౌద్ధాన్ని మనువాద వర్గం దాడులు చేసి బౌద్ధా ఆరామాలను  కూల్చివేసి బౌద్ధ బిక్షులను పూచకోత కోసి ఈ దేశం నుండి తరిమి వేశారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బౌద్ధాన్ని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉంద ని జిల్లాల వారీగా బిఎస్ఐ కమిటీలను వే యడం జరుగుతుందని అన్నారు. 

తదనంతరం  మంచిర్యాల  జిల్లా బిఎస్ఐ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా బిఎస్ఐ కమిటీ అధ్యక్షుడిగా  కే.యుగంధర్ సాయి, ప్రధాన కార్యదర్శి గా వేల్పుల కిరణ్,ఉపాధ్యక్షులుగా వేముల కిరణ్, ఆవు నూరి లచ్చన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా  కుంటాల శంకర్, ఈసీ సభ్యులుగా తోటపల్లి భూమన్న, సలహా దారులుగా పల్లెమల్లయ్య, సాగే సుమోహన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు గోసికే మల్లేశం,  జన విజ్ఞాన వేదిక నాయకులు  ఎడ్ల కిష్టయ్య, బి ఎస్ ఐ నాయకులు శ్రీ ప్రేమ్ కుమార్, జోషఫ్, లక్ష్మన్ దుర్గే తదితరులు పాల్గొన్నారు.