అటవీ, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత.
- ప్రవీణ్ నాయక్ ముత్యం పెళ్లి రేంజ్ సహాయ అటవీశాఖ అధికారి
![]() |
| గ్రామస్తుల ఉద్దేశించి మాట్లాడుతున్న డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్ . |
Scv News Kasipet:--
కాసిపేట మండలం ముత్యంపల్లి సెక్షన్ పరిధిలోనీ గురువాపూర్ గ్రామంలో ఈరోజు అటవిశాఖ అధికారులు అటవీ, వన్య ప్రాణుల సంరక్షణ, అడవిలో అగ్ని ప్రమాదాల నివారణ గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముత్యం పెళ్లి అటవీశాఖ Dy R O ప్రవీణ్ నాయక్ గ్రామస్తుల నిర్దేశించి మాట్లాడుతూ అటవీ జంతువుల తాగు నీటి కోసం చెక్ డ్యాం, కుంటల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. అటవీ జంతువులు దారి తప్పి గ్రామాల్లోకి వస్తే వాటికి హాని కలిగించకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలని, వన్య ప్రాణులను వేటడారాదని, వన్యప్రాణులతోనే అడవి మనుగడ ఉంటుందన్నారు. వంట చెరుకు కోసం ఎడ్ల బండ్ల తో కాకుండా నెత్తి మోపుల ద్వారా తీసుకొచ్చుకోవాలని,అడవి పై ఆధార పడడం తగ్గించుకోవాలని, అడవిని ఆనుకుని ఉన్న పంట చేనుల్లో పత్తి కర్ర కాలబెట్టెప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకొని అడవిలో మంటలు వ్యాపించకుండ చూడాలని కోరారు. అటవీ చట్టాలు చాలా కటినమైనవి అని ,కావున అటవీ నేరాలు చేసి ఇబ్బందులకు గురి కావొద్దని సూచించారు.
అటవీ శాఖ అధికారులు వచ్చే ఎండాకాలం నందు మంటలు వ్యాప్తి అవకుండా ఉండేందుకు చర్యలు చేపడతా మని అన్నారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని గ్రామ యువతకు సూచించారు.ఈ సమావేశంలో బీట్ ఆఫీసర్ సురేష్,గ్రామ పటేల్ భీము, లక్ష్మణ్,గ్రామస్థులు పాల్గొన్నారు.
