మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

భీమా కోరేగావ్ విజయోత్సవ వేడుకలు జరుపు కుందాం!.

 బహుజన సోదరులారా ...! కొత్త సంవత్సర వేడుకలు కాదు గ్రామగ్రామాన భీమా కోరేగావ్ విజయోత్సవ వేడుకలు జరుపు కుందాం!.

బహుజన పోరాటయోధులు భీమా కోరేగావ్ మహార్ యుద్ధ వీరులు! 

"భారతదేశ చరిత్ర అంటే ఆర్య - అనార్య, బ్రాహ్మణ నిజానికి,బౌద్ధానికి జరిగిన పోరాట చరిత్ర " అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్.

 ' సింహాలు తమ చరిత్రను తాము రాసుకోలేనంత కాలం వేటగాళ్లు రాసిందే వాటి చరిత్ర అవుతుంది' అంటాడు దక్షిణాఫ్రికా కవి చినిబా ఆచిబా

భారతదేశ చరిత్ర మొత్తం ఈ దేశ మూలవాసులైన ద్రావిడ సింహాల ను వేలాది సంవత్సరాలుగా అణచివేసిన వేటగాళ్లయిన ఆర్య బ్రాహ్మణులు రాసిన చరిత్రే. అందులో నిజాలు కనబడవు. 





Scv News Kasipet :--

భారతదేశ బహుజన చరిత్రలో

భీమా కోరేగావ్ యుద్ధం చాలా ప్రముఖమైనది. ఈ దేశ మూలవాసు లైన మహర్ సైనికులకు - పీష్వా బ్రాహ్మణ సైనికులకు మధ్య జరిగిన యుద్ధం అది. భారతదేశ చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ బ్రాహ్మణులకు - బహుజనులకు మధ్య జరిగినవే.205 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు రాబోవు తరాలకోసం విజయ చరిత్రను మనకు అందించారు. అటువంటి పోరాట చరిత్ర ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీలు గా పిలువ బడుతున్న బహుజన జాతులే ఈ దేశ మూల భారతీయు లని, ఈ భూమి మనది, ఈ దేశ సంపద మనది, సంస్కృతి మనది, అప్పుడు మనం పాలకులం, మనదీ ద్రావిడ జాతి అని మన పూర్వీకులు ఆధారాలతో చెప్పినా నమ్మే పరిస్థితిలో ఈనాడు బహుజన సమాజం లేదు.

ఈ దేశాన్ని ఆక్రమించిన ఆర్య బ్రాహ్మణులు తరతరాలుగా ఈ జాతిని అణిచివే వేయాలని లక్ష్యంతో హేతుబద్ధం గా ఆలోచించకుండా మన మెదళ్లకు సంకెళ్లు వేసి మానసిక బానిసలుగా తయారు చేశారు. చరిత్రలో జరిగిన వాస్తవాలను తెలుసు కోకుండా మనువాదం బ్రాహ్మణ వర్గం అబూత కల్పనలు పుక్కిటి పురాణాలను నమ్మే దుస్థితిలో ఈరోజు బహుజన వర్గం జీవిస్తుంది.ఈ దేశ మూలవాసు లకు జరిగిన అన్యాయాలను, చారిత్రక సత్యాలను మహాత్మ జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్సిరాం పరిశోధించి ఎన్నో రచనల ద్వారా తెలియజేశారు. తమ జీవిత కాలమంతా బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశారు. బహుజన వర్గాల చైతన్యం కోసం ఎన్నో పోరాటాలు చేసినా మనం మాత్రం మారడం లేదు. ఇంకా మనువాద బ్రాహ్మణ విష కౌగిలిలోనే జీవించేందుకే మొగ్గు చూపుతు న్నాము.

 జనవరి 1న బీమా కోరేగాం యుద్ధ వీరుల ' విజయ దివాస్' సందర్భంగా నేటి యువతరం బహుజన పోరాట వీరుల యుద్ధం గురించి తెలుసుకుని బహుజన రాజ్యస్థాపన కోసం కృషి చేస్తారనే లక్ష్యం తో scv news అందిస్తున్న ప్రత్యేక కథనం..

భీమా కోరేగావ్ యుద్ధం గురించి తెలుసుకుందాం .!

భారతదేశంలో మొట్టమొదటి విదేశీ దండయాత్ర Bca1500 సంవత్సరాల క్రితం ఆర్యులతో ప్రారంభమైంది. సింధూ లోయ ప్రాంతంలో ఉన్న హరప్పా సింధు, ద్రావిడ నాగరికత ను ధ్వంసం చేశారు. అప్పటి ద్రావిడ రాజులను ఆర్యులు యుద్ధాలలో ఓడించి ద్రావిడ రాజ్యాలను హస్తగతం చేసుకున్నారు.మూల భారతీయు లందరినీ బానిసలుగా చేసుకొని పరిపాలన కొనసాగించారు. ఆర్యులు ఈ దేశ మూలవాసుల ను నాలుగు వర్ణాలుగా విభజించి పరిపాలించారు. ఆర్యుల చేతిలో ఓడిపోయిన దేశం మూలవాసుల ను సూద్రులు, అతి శూద్రులుగా పేరు పెట్టి హీనంగా చూశారు. వారిని చదువుకు దూరం చేశారు. ఆయుధాలను పట్టనివ్వలేదు.

వారి తరువాత భారత దేశం మీదికి దండయాత్రకు వచ్చిన గ్రీకులు, అరబ్బులు,యూరోపియన్లు ఆర్య బ్రాహ్మణుల చేతిలో వివక్షకు గురవుతున్న మూల భారతీయులైన బహుజన కులాలకు చెందిన ఎస్సి, ఎస్టి, బిసిల ను తమ సైనికదళాలలో చేర్చుకున్నారు. వారి అండదండల తోనే దేశ బ్రాహ్మణ రాజులను ఓడించి వందలాది సంవత్సరాలు పరిపాలన సాగించారు. 'ఈ దేశం ఎక్కువసార్లు విదేశీ దండయాత్ర గురికావడానికి మనువాద బ్రాహ్మణులే కారణమని ' 'శూద్రులు అతి శూద్రులు ఆయుధాలు పట్టకూడ దని ఆంక్షలు విధించడంతో విదేశీ దండయాత్రలు ఎదుర్కొనేందుకు మెజారిటీ వర్గాలైన బహుజనులు దూరం ఉండటం వల్ల బ్రాహ్మణ రాజులు ఓడిపోయి ఎక్కువ కాలం విదేశీయుల పాలన లోనే భారతదేశం ఉండాల్సి వచ్చిందని' బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్లేషించాడు.

బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో ఈ దేశంలో ప్రవేశించి చిన్నచిన్న రాజ్యాల ను స్వాధీనం చేసుకుని రాజ్య పాలనకు అడుగులు వేసారు. మొట్టమొదటి సారిగా 1757లో ఈస్టిండియా కంపెనీ దళాలకు - బెంగాల్ నవాబు సిరాజుద్దీన్ సైన్యాల మధ్య ప్లాసి వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మెజారిటీ సైనికులు ఈ దేశ మూలవాసులు అంటరాని వరైనా దుసాధులు బ్రిటిషర్ల తరఫున యుద్ధంలో పాల్గొన్నారు. ఇందులో బ్రిటిష్ దళాలు గెలిచాయి. చరిత్రలో దీనికి ప్లాసి యుద్ధమని పేరు పెట్టారు. చివరి యుద్ధం 1818లో మరాఠా సామ్రాజ్యం తో జరిగిన భీమ కోరేగాం యుద్ధం. ఈ యుద్ధంలో బ్రిటిషర్ల తరఫున ఈ దేశ మూలవాసులైన అంటరాని వారైనా మహర్లు పోరాడారు. వారి ధాటికి మరాఠా సామ్రాజ్యం బ్రాహ్మణ పీష్వాల రాజ్యం ధ్వంసమై భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యం సుస్థిరమైఅంది ఈ విధంగా 1757 - 1818 మధ్యకాలంలో బ్రిటిష్ సైన్యంలో మూల భారత సైనికుల సహాయంతోనే సాధ్యమైంది. దుసాదుల నుండి మహార్ సైనికుల వరకు అందరూ అంటరాని జాతుల సైనికుల సహాయంతోనే ఆంగ్లేయుల విజయం సాధ్యమైంది.

 బ్రాహ్మణ పీష్వాల పాలనలో శూద్రులు, అతిశూద్రల పై తీవ్రవివక్ష .

మహారాష్ట్రలో చత్రపతి శివాజీని బ్రాహ్మణ పీస్వా వర్గం కుట్ర చేసి పాలలో విషం కలిపి హత్య చేసిన తర్వాత మరాట సామ్రాజ్యం మొత్తం పీష్వా బ్రాహ్మణుల చేతిలోకి వెళ్ళింది. పీష్వాల పాలనలో మహర్,మాంగ్ అంటరాని జాతులవారు వీధుల్లో తిరిగే పరిస్థితులు లేవు. పగటిపూట వీరి నీడ బ్రాహ్మణులపై ,వారి వస్తువులపై పడుతుందని తిరగ నిచ్చేవారు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో తిరిగితే బ్రాహ్మణులు కనబడితే నేలమీద పడుకోవాలి. కాలు అడుగు జాడలు వీధుల్లో కనబడకుండా వెనుక చీపురు, ఉమ్మి వేసేందుకు నోటికి ముంతా, ఎదురుగా ఎవరూ రాకుండా ఉండేందుకు గంట ఊపుతూ వెళ్లేవారు. ఇలాంటి వివక్షకు గురైన మహర్ లు బ్రాహ్మణ పీష్వాల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసేవారు. ఆంగ్లేయుల సైన్యంలో చేరి మరాఠా బ్రాహ్మణ సైన్యంపై పోరాటాలకు ఉత్సాహంగా దిగేవారు.

భీమా కోరేగావ్ యుద్ధం జరిగింది ఇలా ..!

 మహారాష్ట్రలోని పూణే సమీపంలో భీమా నది ఒడ్డున ఉన్న కోరేగాం గ్రామ సమీపంలో 31 డిసెంబర్ 1817లో బ్రిటిష్ సైన్యాధిపతి స్టాంటన్ నాయకత్వం లో 500 మంది పదాతి దళ మహార్ సైనికులు, 250 మంది సాధారణ అశ్వదళంతో కోరేగామ్ గుట్ట కింద 25 వేలమంది అశ్వికదళం, 5 వేల మంది పదాతి దళం ఉన్న పీష్వా బ్రాహ్మణ సైన్యంతో పోరాటానికి దిగింది.

మరాటా సైన్యంతో గెలవడం అసాధ్యమని బ్రిటిష్ సైన్యాధిపతి స్టాంటన్ యుద్ధం విరమించాలని ప్రయత్నం చేశాడు.దీనికి ససేమిరా అన్న మహార్ సేనాధిపతులు శిఖనాక,రతనాక, జతనాక లు ముందుండి పోరాడారు. ఒక్కొక్క మహార్ సైనికుడు 50 మంది పిశ్వ బ్రాహ్మణ సైన్యాలను ఉచ కోత కోసి విజయం సాధించాయి. ఈ మరాఠా యుద్ధంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశంలో స్థిరపడింది. యుద్ధ విజయం ఆంగ్లేయులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ యుద్ధంలో చనిపోయిన 22మంది మహార్ సైనికుల స్మారకార్థం బ్రిటిష్ ప్రభుత్వం బీమా కోరేగావ్ గ్రామంలో స్మారక స్థూపాన్ని నిర్మించింది. 21 మార్చి 1821 నాడు విజయ స్థూపానికి శంకుస్థాపన చేశారు. 32 చదరపు అడుగుల వెడల్పు లో 65 అడుగుల ఎత్తులో నిలువెత్తు స్థూపాన్ని నిర్మించి 1822లో పూర్తిచేసింది. జనవరి ఒకటవ తేదీ మహర్ సైనిక బలగాల ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. విజయ స్థూపానికి సైనిక వందనాలు తుపాకుల పేలుళ్ల మధ్య ప్రతి ఏటా ఉత్సవాలు జరపడం జరుగుతుంది.

 ఈ విధంగా క్రీస్తుశకం 1757 నుండి 1818 వరకు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం మూలవాసులైన బహుజనులను సైన్యంలో చేర్చుకొని వారితో బ్రాహ్మణ సైన్యాలను ఓడించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. బహుజన వర్గాలకు క్రైస్తవ మిషనరీల ద్వారా విద్య,వైద్యం అందించేందుకు పాఠశాలలు వైద్యశాలలు ఏర్పాటు చేశారు.సతీసహాగమనం, బాల్య వివాహాల లాంటి దూర్మార్గపు చట్టాల ను రద్దు చేసారు. బహుజన వర్గాలకు కల్పించిన బ్రిటిష్ వారు కల్పించిన సదుపాయాలను వ్యతిరేకిస్తూ మనువాద బ్రాహ్మణ వర్గం 1857లో ప్రథమ స్వతంత్ర యుద్ధం పేరిట సైనిక తిరుగుబాటు చేశారు.

  బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్శనతో వెలుగులోకి వచ్చిన మహావీరుల చరిత్ర. 

బాబాసాహెబ్ అంబేద్కర్ జనవరి ఒకటి 1927లో మొదటిసారి విజయ స్తంభాన్ని సందర్శించి వందనం స్వీకరించారు. మూల భారతీయుల చరిత్రలో ఈ దినాన్ని 'విజయ దివాస్ 'గా జరుపుకోవాలని అంబేద్కర్ బహుజన సమాజానికి పిలుపు నిచ్చారు. బాబాసాహెబ్ జీవించి ఉన్నంత వరకు ఎన్ని ఒత్తిడి గల పనులుండిన కోరేగాం సందర్శన మానలేదు. తద్వారా ఆయన భారతీయ మూల యోధుల స్మృతిని ప్రపంచానికి చాటడం కొనసాగించారు. గత 96 సంవత్సరాలుగా ప్రతి ఏటా జనవరి 1న లక్షలాదిమంది బహుజనులు విజయ దివాస్ లో పాల్గొని శక్తిస్తల్ ను సందర్శించి భీమా కోరేగావ్ అమరవీరులకు నివాళు లర్పిస్తున్నారు. 2018 లో బీమా కోరేగాం అమరవీరుల 200 విజయ్ దివాస్ సందర్భంగా లక్షలాదిమంది ప్రజలు తరలి వెళ్లారు. మనువాద బ్రాహ్మణ ఫిష్వా వర్గం ఓర్వలేక అల్లర్లు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేసింది. హాజరైన మేధావి వర్గంపై కుట్ర కేసు నమోదు చేసి జైల్లో వేసింది. కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా గత సంవత్సరం 205 విజయ్ దివాస్ సందర్భంగా కూడా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి లక్షలాదిమంది బహుజన వర్గం బీమా కోరేగాం శక్తి స్థలాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పిస్తూనే ఉన్నారు. 

బహుజన సోదరులారా.. నూతన సంవత్సర వేడుకల పేరిట మందు,విందు లో మునగకుండా మూలవాసుల చరిత్రను తెలుసుకొని వారి స్మారక ఉత్సవాలు జరుపు కోవాలని కోరుతున్నాను. ప్రతి గ్రామంలో ' 'బీమా కోరేగావ్ అమరవీరుల విజయ దివాస్ ' ను జరుపుకోవాలని అంబేద్కర్ వాదులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతోంది.