తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణపై రేవంత్ సర్కార్ ఉక్కు పాదం.
- తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో డ్రగ్స్,గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు.
- కాసిపేట మండలంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు.
- మండలాన్ని గంజాయి రహిత మండలం గా ప్రకటించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్. -
- టిఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు.
- గంజాయి మత్తులో జోగుతున్న యువత, విద్యార్థులు.
| Scv News Kasipet:-- |
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల ప్రజా వ్యతిరేక నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కూకటివేళ్ల తో కూల్చేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సోనియా గాంధీ త్యాగాన్ని తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్పారు. ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించగానే విప్లవాత్మక నిర్ణయాలతో తెలంగాణ ప్రజల ఆధారభి మానాలు పొందుతున్నాడు. ప్రమాణ స్వీకారం రోజే ప్రజలకు అందుబాటులో లేని కెసిఆర్ దొర ప్రగతి భవన్ గడీలను బద్దలు కొట్టి ప్రజా పాలనను ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అందించారు.
తెలంగాణ గ్రామాల్లో మత్తుమందుల విక్రయాలతో ప్రజల జీవితాలను చిన్న భిన్నం చేస్తున్న బెల్ట్ షాపులు గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ సర్కారు ప్రజలకు భరోసా ఇచ్చింది.
తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హాయంలో శాంతిభద్రతల పరిరక్షణలో అవినీతి, అక్రమాలు డ్రగ్స్, గంజాయి అరికట్టడంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్ల ప్రజల సహకారం తో గ్రామస్థాయిలో పోలీసులు డ్రగ్స్ గంజాయి పై ఉక్కు పాదం మోపేందుకు సిద్ధమవు తున్నారు. తెలంగాణను దేశంలోనే డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించింది. డ్రగ్స్ గంజాయి ఆచూకీ తెలిస్తే టీఎస్ నియాబ్ హెల్ప్ లైన్ నెంబర్ 87126711 ఫోన్ చేసి సమాచారం ఇయ్యాలని గంజాయి డ్రగ్స్ నిర్మూలన డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలంగాణ ప్రజలకు పిలుపు నివ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు .
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యల వల్ల గత పది ఏళ్లుగా నియంతృ త్వ దొరపాలనలో ఉన్న తెలంగాణ ప్రజల్లో ఆనందోత్సవాలు వెల్లి విరుస్తున్నాయి.
తెరాస పాలనలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు. పట్టించుకోని ప్రభుత్వం.
తెలంగాణలోని యువత, విద్యార్థులు బావి భారత నిర్మాతలుగా దేశ సమాజ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించా ల్సిన చిన్న వయసులోనే గంజాయి, డ్రగ్స్ మద్యం లాంటి మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసు కుంటున్నారు. మత్తు పదార్థాల వ్యసనాల బారిన పడకుండా యువతను కాపాడవలసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది . పదేళ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఆదాయాలు పెంచుకునేందుకు, తమ అవినీతి అక్రమాలను ప్రశ్నించకుండా ఉండేందుకు యువతను విద్యార్థులను మద్యం మత్తులో ముంచేందుకు ప్రయత్నించాడు. ఆబ్కారి శాఖ ద్వారా మద్యం విక్రయాలను పెంచేందుకు ప్రయత్నించాడు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. ఊరురా బెల్ట్ షాపులతో పాటు ప్రతి గ్రామంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగాయి. ఫలితంగా యువత విద్యార్థులు మద్యం మత్తులో చెడు మార్గాల వైపు ప్రయాణిస్తూ నేరస్తులుగా మారారు. వీరు సమాజానికి, కుటుంబాలకు చెడ్డ పేరు తెస్తూ తల్లిదండ్రులను మానసికక్షోభకు గురిచేశారు. కేసీఆర్ 10 ఏళ్ల ప్రభుత్వం హాయంలో గంజాయి మత్తును అరి కట్టాల్సిన పోలీసు శాఖను పూర్తి నిర్వీర్యం చేశారు.పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా అధికారి పార్టీ నాయకులు ప్రజాప్రతి నిధులు వారిపై పెత్తనం చెలాయిస్తూ స్వేచ్ఛగా విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారు. గ్రామాల్లో గొడవలకు శాంతి భద్రతల విఘాతం కల్పిస్తున్న బెల్ట్ షాపులను గంజాయి విక్రయాలను అరికట్టాలని ప్రభుత్వానికి,పోలీస్ అధికారులకు, ప్రజలు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదు. ఇదే అదనుగా కొంతమంది పోలీస్ అధికారులు గంజాయి విక్రయాల నరికట్టకుండా బెల్ట్ షాపుల యజమానులు,గంజాయి విక్రయించే వారి వద్ద మామూలు వసూల్లకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చారని ప్రజల గోడును ఏనాడు పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హాయంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు గ్రామస్థాయిలో పోలీస్ అధికారులచే అవగాహన సదస్సులు మొక్కుబడిగా నిర్వహించింది తప్ప ఎలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టలేదని విమర్శలు ఉన్నాయి.
కాసిపేట మండలంలో విచ్చలవిడి గా గంజాయి విక్రయాలు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో దశాబ్దం వరకు గంజాయి సేవించడం రెండు మూడు గ్రామాలకే పరిమితమై ఉండేది. తెరాస ప్రభుత్వ హయాం లో చాప కింద నీరులా గంజాయి విక్రయాలు మండలంలోని అన్ని గ్రామాలకు విస్తరించాయి. 200 రూపాయల క్వార్టర్ బాటిల్ ఇచ్చే మత్తు,కేవలం 50 రూపాయల గంజాయి పొట్లంతో ఎక్కువ మత్తు రావడంతో మద్యం వ్యసనపరులు గంజాయి తాగేందుకు అలవాటు పడ్డారు. మండలంలోని వివిధ గ్రామాల లో సాయంత్రం అయితే చాలు ప్రభుత్వ పాఠశాల భవనాలు రహదారుల ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో గుంపులు, గుంపులు గా యువకులు మద్యం గంజాయి సేవిస్తూ మత్తులో జోగుతుండడం సర్వసాధారణం అయింది. దశాబ్ద కాలం క్రితం వరకు గంజాయి సేవించే అలవాటు రేగులగూడెం కోమటి చేను గ్రామాలకే పరిమిత మై ఉండేది. ఇటీవల కాలంలో కాసిపేట మండలం లోని అన్ని గ్రామాలకు వ్యాపించింది. మండల కేంద్రంలోని విద్యాసంస్థల్లో చదువు కునే విద్యార్థులకు కూడా గంజాయి సరఫరా అవుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. తెరాస ప్రభుత్వ హాయంలో కాసిపేట, దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదైన ఘటన లు దీనికి ప్రత్యక్ష నిదర్శనాలు. గత రెండు సంవత్సరాల క్రితం కాసిపేట పోలీసులకు గంజాయి విక్రయిస్తూ దుబ్బగూడెం గ్రామంలో ఆసిఫాబాద్ నుండి వచ్చిన ఒక వ్యక్తి పట్టుబడ్డారు. అతని దగ్గర గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబడిన వారిలో కాసిపేట, ముత్యం పల్లి, తుంగగూడెం, ఇతర గ్రామాల వ్యక్తులు ఉండటం గమనార్హం. మండల కేంద్రంలోని విద్యార్థులకు గంజాయి సరఫరా చేసే ముఠాలు గత రెండేళ్ల క్రితం మందమర్రిలో పోలీసుల కు పట్టుబడ్డాయి.పోలీసులు విద్యార్థు లను వారి తల్లిదండ్రుల ను పోలీస్ స్టేషన్లకు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలి వేసిన సందర్భా లు ఉన్నాయి.
మండలంలో గంజాయి విక్రయించే కేంద్రాలు.
మండలానికి గంజాయి సరఫరా మహారాష్ట్ర,కరీంనగర్, తిర్యాని మండలాల నుండి అవుతుందనే ప్రచారం ఉంది. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ లోడ్ కు వచ్చే వివిధ రాష్ట్రాలలోని లారీ డ్రైవర్ల ద్వారా కూడా ఇక్కడ గంజాయి సరఫరా జరుగుతుంది.కాసిపేట,ముత్యం పల్లి, కొండాపూర్ యాప సెంటర్, దేవపూర్ లోని పాన్ షాపులు దుకాణాలలో గంజాయి విక్రయా లు జోరుగా సాగుతున్నాయి. తిర్యాని మండలం లోని రొంపెల్లి, మాణిక్యపూరు, మంగి ప్రాంతాల అటవీ ప్రాంతాల్లో రహస్యం గా గంజాయి సాగవు తుందనే ప్రచారం ఉంది. అక్కడి నుండి గంజాయి సోనాపూర్ పంచాయతీ లోని గ్రామాలకు సరఫరా అవుతుంది. సోనాపూర్ లోని పంచాయతీ ఒక గిరిజన గ్రామం గంజాయి విక్రయానికి అడ్డగా మారింది. ఇక్కడి నుండే మండలంలోని గ్రామాలకు సరఫరా అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాసిపేట, దేవాపూర్ పోలీసు అధికారులు గంజాయి సరఫరా కేంద్రాలపై, గతంలో పట్టుబడ్డ వారిపై దృష్టి సారిస్తే గంజాయిని మండలంలో వారి కట్టడం సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గంజాయి కి అలవాటు పడితే జీవితాలు నాశనం.
గంజాయి బంగు డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు రోడ్ల వెంట తిరిగే బిచ్చగాళ్ళు, మతం ముసుగులో ఉండే సన్యాసులు కూలీలు సేవించేవారు. వారు గంజాయిని ప్రత్యేక గొట్టాలలో పెట్టుకొని పీల్చేవారు. ఇప్పుడు చిన్న చిన్న పొట్లాల ద్వారా గంజాయి సరఫరా అవుతుంది.సిగరెట్లు నింపిల వద్ద విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు ప్రస్తుతం మద్యం ధరలు పెరగడం వల్ల మత్తుకు అలవాటు పడి కూలీలు, యువకులు, విద్యార్థులు వందల రూపాయలు పెట్టి మద్యం కొనలేక 50 రూపాయలకే దొరికే గంజాయి పొట్లాలు కొనుక్కొని సిగరెట్లలో పెట్టుకొని పిలుస్తూ రోజంతామత్తులో ఊగుతున్నారు.
గంజాయి మనిషి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు శరీరాన్ని నడిపించే ప్రధానమైన మెదడు నరాల వ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మత్తు పదార్థాలకు అలవాటు అయితే కొద్దిరోజుల్లో మానసిక రోగులుగా మారి మతిస్థిమితం కోల్పోయి పిచ్చి వాళ్ళలా తయారవుతారు. ఎలాంటి కూలీ పని చేసుకోలేక భార్యా పిల్లలను తల్లిదండ్రులను పోషించుకోలేక జీవితం అగమ్య గోచరంగా మారి ఆత్మహత్యలకు దారితీస్తుంది. గంజాయి మత్తులో పడి ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా మండలంలో చాలామంది ఉన్నారు.
పోలీసు శాఖకు ప్రజలందరూ సహకరించాలి.
తెలంగాణలో ఎట్టకేలకు ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి ప్రజలంతా సహకరిస్తేనే గత ప్రభుత్వ హాయం లోని పాపాలను అరికట్టడం సాధ్యమవుతుంది. గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు సామాజిక బాధ్యతగా తీసుకొని దేవపూర్, కాసిపేట పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మండలాన్ని గంజాయి రైతు మండలంగా తీర్చిదిద్దేందుకు మండలంలోని గ్రామాలలోని బాధ్యతగల పౌరులందరూ ముందుకు వచ్చి ప్రతిజ్ఞ చేయాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూప్ కోరుతుంది.
.

