మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో శ్రీకాంతాచారి వర్ధంతి.

 కాసిపేట మండలం  లో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో  శ్రీకాంతచారి వర్ధంతి.



Scv News Kasipet:-

కాసిపేట మండలం  ముత్యంపల్లి గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కాసోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్రపటానికి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు  పూలమాలవేసి నివాళులర్పించ డం జరిగింది. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి శిల్లోజు మురళి మాట్లాడుతూ  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కోసం అమరుడైన శ్రీకాంత్ చారి కుటుంబా నికి, విశ్వబ్రాహ్మణులకు కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజేందర్ చార్యులు,గ్రామ అధ్యక్షుడు చింతోజు ప్రభాకర్ చార్యులు, కార్యదర్శి సిలోజు శ్రీనివాస్ చార్యులు, కోశాధికారి సీలోజు నరసింహచార్యులు, జనార్ధన్ చార్యులు శంకరయ్య చార్యులు, నరసింహ చార్యులు, రమేష్ చార్యులు,రాములు చార్యులు,రాజన్న చార్యులు శ్రీనివాస్ చార్యులు, రవి చార్యులు సతీష్ చార్యులు పాల్గొన్నారు.