మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.

 కాసిపేట  మండలంలో ఘనంగా సోనియా గాంధీ  జన్మదిన వేడుకలు. 

 

 కాసిపేట మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకుడు కుమారస్వామి.


Scv News Kasipet:--

కాసిపేట మండలంలోని  ధర్మారావుపేట, కాసిపేట, సోమ గూడెం గ్రామాలలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోనియా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు కేకులు కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

కాసిపేటలో.... 

కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద  యువజన కాంగ్రెస్ నాయకుడు, జిల్లా యాదవ సంఘం యూత్ అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో  సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, 500 కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళా లోకానికి ఎంతో లాభదాయకమని సోనియా గాంధీ  పుట్టినరోజు సందర్భంగా ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు ఆరే సునీత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ దారవెని రాజన్న ,కో ఆప్షన్ సభ్యులు సిరాజ్ ఖాన్,మాజీ సహకార సంఘ చైర్మన్ వంశీధర్, రేశవేని.ఓదెలు,నర్సింగ్,ముత్తంపల్లి అధ్యక్షులు మైధం రమేష్,sc సెల్ ప్రెసిడెంట్ గోలేటి స్వామి, రామ్మూర్తి, మేడ రామచందర్, పుర్రపోషం, మల్లెతుల రాజేశం,బరిగల చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రేశావెని స్వామి,బన్న రవిరాజ్ , జంపయ్య, మారం రాజ్ కుమార్, బోయిని సాయికుమార్, మూర్తుజ, బిక్షపతి, సమీల్ కుమార్,నలిగేటి నరేష్, బోయిని మహేష్,బోయిని శ్రీనివాస్  పాల్గొన్నారు.

ధర్మ రావు పేటలో ...

 ప్రేమ్సాగర్ రావు నివాసంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు. కేక్ కట్ చేస్తున్న ఎంపీటీసీ పార్వతి మల్లేష్.
ధర్మ రావు పేట మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  స్వగృహంలో పార్వతి మల్లేష్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గోపు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కొప్పుల శంకరయ్య చనవేని చంద్రయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు జంగిలి రమేష్ యాదవ్, తన్నీర్ మహేష్, మాజీ సర్పంచ్ పార్వతి రావు, ముత్యాల సది, సజ్జనపు చంద్రశేఖర్, మామిడాల ప్రసాద్, గుమ్ముల మల్లేష్,నరసయ్య, విద్యాసాగర్, చిల్కయ్య,చొప్పదండి గట్టయ్య, సుధాకర్,అనవేని శ్రీనివాస్, ముత్యాల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

సోమ గూడెంలో...
 సోమ గూడెం లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.
లంబడి తండా కే పంచాయతీలోని  సోమ గూడెంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ వంశీధర్ రావు, కాంగ్రెస్ నాయకుడు తోడేటి కృష్ణ ఆధ్వర్యంలో  కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.