సోనాపూర్ వరకు బస్సు నడపాలని గిరిజనుల వినతి.
Scv News Kasipet :--
సోనాపూర్ వరకు బస్సు నడపాలని ఆదివాసి సేవా సంఘం నాయకులు గిరిజనులు ప్రభుత్వానికి వేడుకోలు.
కాసిపేట మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన సోనాపూర్, గట్రావ్ పెళ్లి పంచాయితీల వరకు ఆర్టీసీ బస్సులు నడపాలని గిరిజనులు వేడుకుంటున్నారు. ఆరు నెలల నుండి సోనాపూర్ కు బస్సు నడవడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడం ఆనందదాయకమని దీనివల్ల గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందని ఆదివాసి సేవా సంఘం మండల ప్రధాన కార్యదర్శి సిడం గణపతి, ఉపాధ్యక్షుడు పెంద్రం ప్రభాకరు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ జోక్యం చేసుకొని సోనాపూర్ వరకు బస్సు నడిపేలా చూడాలని వారు ఒక ప్రకటనలో కోరారు.