ప్రభుత్వ భూమిని కాపాడాలని,పేదలకు ఇంటి స్థలాలివ్వాలని సోమ గూడెం వాసులు తాహాసిల్దార్ ఫిర్యాదు.

తాసిల్దార్ కు వినతి పత్రం ఇస్తున్న సోమగూడెం కే గ్రామస్తులు
Scv News Kasipet:--
కాసిపేట మండలం సోమ గూడెం కే గ్రామపంచాయతీలో గల సర్వేనెంబర్ 146/14 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తాసిల్దార్ కు ఈరోజు ఫిర్యాదు చేశారు.
ఈ ప్రభుత్వ భూమిని KK OC పరిధిలో లేకున్నా ఉన్నట్టు నకిలీ పత్రాలు సృష్టించి పరిహారం పొందిన వారిపై చర్య తీసుకొని ఇట్టి భూమిని ఇళ్లు లేని పేదలకు పంచాలని తహసిల్దార్ కి ఇచ్చిన వినతి పత్రంలో గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా సిపిఎం కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న ట్యాంక్ బస్తి గ్రామం ఏర్పాడక ముందు ఈ స్థలంకి సింగరేణి వారు డబ్బులు చెల్లించి వారి పరిధిలోకి తీసుకొని నీలగిరి చెట్లు పెట్టారని అన్నారు. సింగరేణి యాజమాన్యం 1991 లో సింగరేణిలో పని చేస్తున్నదుబ్బగూడెం,కాసిపేట,వరిపేట గ్రామాలకు చెందిన కార్మికులకు ఇంటి సౌకర్యం కల్పించకపోవడంతో ఇక్కడ వారు సొంతంగా ఇండ్లు నిర్మాణం చేసుకొని ఉంటున్నా రన్నారు.
అప్పటి ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని ప్రభుత్వ అవసరాల కోసం మరియు పోలీసు క్వార్టర్ ల నిర్మాణం కోసం సుమారు 8 ఎకరాలు భూమిని తీసుకొని హద్దులు పెట్టారని,క్రమేపి ఇట్టి భూమి ఖాళీగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటున్నదన్నారు. ప్రస్తుతం నూతనంగా ఏర్పడిన సోమగుడెం (కే) గ్రామ పంచాయతీ క్రీడా మైదానం,గ్రామ పంచాయతీ కార్యాలయం కోసం అధికారులు కొంత భూమిని కేటాయించారని, మిగతా భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ కొంత మంది రాజకీయ నాయకులు బినామీ పేర్లతో కబ్జా చేసి అమ్ముకోవడం కోసం ట్రాక్టర్ పెట్టి చదును చేయించారన్నారు.ఇట్టి భూమిని ఇంటి స్థలాలు లేని పేదలకు పంచాలని గత 35 సంవత్సరాలుగా పేదలు పోరాడుతున్నారని ఈ భూమిని కబ్జా దారుల పాలు కాకూడదని గత నెల 3/11/2023 రోజున పిర్యాదు చేశామని కానీ వారు ఏం చర్య తీసుకోలేదన్నారు.కాబట్టి ఇప్పుడు ఇట్టి భూమిని కబ్జా దారుల పాలు కాకుండా కాపాడి పేదలకు పంచాలని,అలాగే KK OC పరిధిలో లేకపోయినా కూడా 2017 లో తప్పుడు పత్రాలు ద్వార చెల్లించిన పరిహారాన్ని రికవరీ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరారు.
తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన వారిలో మాజీ కాసిపేట సర్పంచ్ భుఖ్య చందూలాల్,సోమగుడెం
(కే) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్,యూత్ నాయకులు అజ్మిరా రాజా,అజ్మిరా రవి, శివసాయి మరియు ఇస్లావత్ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.