మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కెసిఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడిన తెలంగాణ ప్రజలు.

 తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నట్టేట ముంచి నియతృత్వ పాలన సాగించిన కెసిఆర్ పాలనకు చరమగీతం పాడిన తెలంగాణ ప్రజలు.

- మోసాలు, అబద్ధాలతో ఎల్లకాలం పరిపాలించ లేరని తేల్చిన తెలంగాణ ప్రజలు.

-  కెసిఆర్ ప్రభుత్వం ఓటమితో గ్రామాల్లో ప్రజల ఆనందోత్సవాలు.



Scv News Kasipet:--

ఆంధ్ర వలసవాదుల పాలనలో నీళ్లు, నిధులు,నియామకాలలో  దశాబ్దాలుగా తీవ్ర అన్యాయం జరిగిందని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక మార్గమని తెలంగాణ ప్రజలు పోరుబాట పట్టారు. 1200 మంది యువకుల ఆత్మ బలిదానంతో పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడిగా కెసిఆర్ అధికారంలోకి వచ్చాడు. పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చకుండా స్వార్థ బుద్ధితో తన కుటుంబం మేలుకొరకే అవినీతి అక్రమాలకు పాల్పడి  తెలంగాణ సంపదను దోచుకున్నాడు. మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని మూర్ఖ పు నిర్ణయాలు,తెలివి తక్కువ ఆలోచనలతో  ఐదు లక్షల కోట్ల అప్పుల పాలు చేసి దివాలా తీయించిన నియంత కెసిఆర్ పాలనకు తెలంగాణ ప్రజలు ఎట్టకేలకు చరమగీతం పాడారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ అధికారంలోకి వస్తే  తమకు ఉపాధితో పాటు గ్రామాల అభివృద్ధి చెందుతాయని ఆశపడ్డ  యువతను ప్రజలను  కెసిఆర్ ప్రభుత్వం  నిట్ట నిలువున  మోసం చేసింది. గత పది ఏళ్ల కెసిఆర్  మూర్ఖపు పాలనలో జిల్లా మండల స్థాయిలో  పరిపాలన స్తంభించి పోయింది. రెవెన్యూ, పోలీసు, మండల వ్యవస్థలన్ని ప్రజలకు సుపరిపాలన అందించక తెరాస నాయకుల చేతిలో బంధిలయ్యాయి. ప్రభుత్వ అస్తవ్యస్త పాలనను ప్రశ్నించిన వారిపై ఉక్కు పాదంతో అణిచివేసి కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ స్వాతంత్రాలను కాలరాశారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అణచివేసి ప్రశ్నించిన వారిని జైలలో పెట్టి నిర్బంధించింది. ' అణిచివేత ప్రతిఘటనకు దారితీస్తుందన్న' చారిత్రక సత్యాన్ని తెలంగాణ ప్రజలు నిరూపించి నిర్బంధాల పాలు చేసిన ప్రభుత్వాన్ని కూల్చివేశారు .

దేశ చరిత్రలో ఉద్యమ నాయకుడిగా పదేళ్లు అధికారంలో ఉండి మూర్ఖపు పరిపాలన సాగించి రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే ఉంది. కెసిఆర్ చేసిన ఆర్థిక దోపిడీ  పాపాలకు ఇంకా 50 ఏళ్ల కు కూడా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కోలుకోదని మేధావి వర్గం ఘోషిస్తుంది.  ఉద్యమ నేతగా ఎదిగి పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధిని సాధించగా  తెలంగాణ ను అన్ని రంగాలలో దివాలా తీయించి తెలంగాణ చరిత్రలో కెసిఆర్ ద్రోహిగా ముద్రపడ్డాడనే సర్వాత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రెవెన్యూ వ్యవస్థ రద్దు మూర్ఖపు నిర్ణయం.

కెసిఆర్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేశంలో వేలాది ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాలలో సమర్థమైన పాలన అందించిన రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారు. తెలంగాణలోని లక్షలాది ఎకరాల భూములను స్వాహా చేసేందుకు కెసిఆర్ కుట్ర తో  ధరణి పోర్టల్ తెచ్చారు . పేద రైతుల వద్ద భూములను కాజేసి  తమ సామాజిక వర్గానికి చెందిన వెలమ మ దొరలకు భూములను అప్పచెప్పేందుకు పట్టేదారు పాస్ పుస్తకాలు కాస్తు కాలాన్ని తీసేయించారు. ధరణి పేరిట తెలంగాణలో భూదంద నడిపి పేద రైతులకు తీవ్ర అన్యాయం చేశాడు.

 కాలేశ్వరం ప్రాజెక్ట్  నిర్మాణం పేరిట రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీయించాడు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో 60 వేల మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి లక్షన్నర అప్పుతో సుమారు ఐదు లక్షల కోట్ల అప్పులు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్షన్నర కోట్ల తెలంగాణ ప్రజాధనాన్ని స్వాహా చేసారు. మిషన్ భగీరథ  కాలేశ్వరం ప్రాజెక్టు,నిర్మాణం కు సుమారు రెండు లక్షల కోట్ల నిధులను ఉపయోగించడం, అందులో సగానికి పైగా కేసీఆర్ కుటుంబం స్వహా చేసింది. దీని ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయించలేక విద్య, వైద్యం ఇతర శాఖలన్నిటికీ నిధులు లేక, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాక తెలంగాణ రాష్ట్రం అధ్వాన స్థితికి వెళ్ళింది.తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ కుటుంబం దోచుకోవడమే కాక నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు దోచు కోవడానికి పూర్తి అధికారాలు ఇచ్చింది. ఎమ్మెల్యేలు తెరాస నాయకులు మొత్తం ఇసుక గనుల భూమాఫియా లు గా తయారై తెలంగాణ ప్రజల సంపదను  దోచుకుని కోటీశ్వరులు అయ్యారు. ఎమ్మెల్యేల అండతో మండల, గ్రామస్థాయిలో అధికార పార్టీ నాయకుల అవినీతికి అంతులేకుండా పోయింది. ప్రభుత్వం పేద ప్రజలకు అందించే సంక్షేమ పథకాలలో కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, బీసీ బందు లాంటి పథకాలలో వీరి చేతివాటం వుంది. తమ అక్రమాలు బయటపడకుండా ప్రభుత్వం అనుకూలంగా  గ్రామ స్థాయిలో పార్టీ శ్రేణులతోఅనుకూలంగా ప్రచారాలు చేసుకున్నారు. పింఛన్లు పెంచామని, రైతు బంధిస్తున్నామని, కల్యాణ లక్ష్మి ఇస్తున్నామని ప్రజలను మభ్య పెడుతూ పదేళ్లు పాలన సాగించారు.

ఊరు రా బెల్ట్ షాపులతో తాగుబోతుల తెలంగాణగా మార్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిధి. 

యువతను మద్యానికి, గంజాయి లాంటి వ్యసనాలకు దూరంగా ఉంచి వారికి ఉపాధి కల్పించి కుటుంబాల అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను మరిచిపోయింది. ప్రభుత్వ పాలనకు ధనార్జన ధ్యేయం గా  ప్రజలను మానసిక బానిసలుగా చేసి పరిపాలన సాగించేందుకు ఊరురా బెల్టు షాపులను పెట్టి తాగుబోతు తెలంగాణగా మార్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిది.

విద్య, వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం.

తెలంగాణలో 85 శాతం  పైగా ఉన్న బహుజన వర్గాల పిల్లలకు విద్యా బోధనను అందించడంలో కెసిఆర్ ప్రభుత్వం తీవ్ర  నిర్లక్ష్యం చేసింది. విద్యా శాఖకు దేశంలోని 29 రాష్ట్రాలలో అతి తక్కువగా ఏడు శాతం నిధులు కేటాయించి ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ చివరి స్థానంలో ఉంది. 119 గురుకుల ఏర్పాటు చేశామని చెప్పి ఒక్క పాఠశాల కూడా పదేళ్ల పాలనలో  పక్క భవనం నిర్మించలేదు.

వైద్యం విషయంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం చేసింది. కరోనా సమయం లో వేలాది మంది ప్రజలు ప్రభుత్వాసు పత్రులు సరైన వైద్యం అందక పిట్టల రాలిపోయిన ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించిఅంది.

యువతకును ఉద్యోగాలు అందించడంలో నిర్లక్ష్యం.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే లక్ష ఉద్యోగాలను కల్పిస్తామని యువకులకు మాటిచ్చిన తెరాస ప్రభుత్వం పదేళ్ల పాలనలో  పదివేల పోస్టులు కూడా భర్తీ చేయకుండా, గ్రూపు పరీక్షలను సమర్థంగా నిర్వహించకుండా పేపర్ లీకేజీలు చేసి ప్రభుత్వం అపాసిపాలై అంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసి  అబద్ధపు, మోసపు మాటలతో పదేళ్ల పాలన సాగించింది.

తెలంగాణ ప్రజలు కెసిఆర్ ప్రభుత్వం తమను ఘోరంగా మోసం చేసిందని ఎట్టకేలకు గ్రహించి కర్రు కాల్చి వాత పెట్టారు. అధికారం మాదే మేం చెప్పినట్టే వినాలని అహంకారంతో విర్రవీగి అబద్ధాలాడే నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అన్నది ఈ ఫలితాలతో నిజమైంది.