మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ప్రజా పాలన గ్రామసభలు.

 నియంత పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి తెలంగాణ రాష్ట్రం.

 - గ్రామాల్లో ప్రజా పాలన గ్రామసభలు ప్రారంభం.

- ఆనందంలో తెలంగాణ వాసులు.

 కాసిపేట మండలంలో నాలుగు పంచాయితీలలో  ప్రజా పాలన గ్రామసభలు.


 సోమగూడెం కే పంచాయతీలో ప్రజా పాలన గ్రామసభ.


Scv News Kasipet :--

 దశాబ్దాల సీమాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంతం తీవ్ర వివక్షకు గురై అన్ని రంగాలలో దోపిడికి గురైంది. నీళ్లు,నిధుల, నియామకాలలో జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రజలు ఊరు వాడలో వంటావారలతో ఉద్యమించడం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించింది. ప్రజా ఉద్యమంతో ఆవిర్భవించిన  తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి తీసుకు వస్తానని ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా గద్దనెక్కాడు. ఆసరా పింఛన్లు,కళ్యాణ లక్ష్మి, రైతుబంధు లాంటి ప్రజాకర్షణ పథకాలతో ప్రజలను మభ్య పెట్టాడు.రెండుసార్లు మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజల క్షేమాన్ని మరచాడు. పదేళ్ల పాలనలో ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం లేక, గ్రామాల్లోని పేదలకు రేషన్ కార్డులు , ఉండేందుకు నివాసగృహం ఇచ్చిన పాపాన పోలేదు. వేలాదిమంది అమరవీరుల ప్రాణ త్యాగంతో ఆవిర్భవించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కుకొని లక్షల కోట్ల సంపద దోపిడికి గురైంది.

దేశ ప్రధానమంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా4.5 లక్షల వేతనం తీసుకున్న కేసీఆర్ రాష్ట్ర పరిపాలన విభాగం సచివాలయం కి వెళ్లకుండా పదేళ్లు ఫామ్ హౌస్ కే పరిమితమై పాలన సాగించాడు. ప్రభుత్వ అధికార నివాసం ప్రగతి భవన్ లోకి ప్రజలను అనుమతించ లేదు. ప్రజా సమస్యల ను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. గత పదిహేళ్లుగా తన పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులకే కలవకుండా నియంతృత్వ పాలన సాగించాడు. గత పదేళ్లలో కేసీఆర్ పరిపాలన గ్రామసభల ద్వారా ప్రజా సమస్యలు వినకుండా ప్రజలతో సంబంధాలు లేకుండా పరిపాలన సాగింది. ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛ, స్వాతంత్రాలు లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టి వేధింపు లకు గురి చేశారు. ఎమ్మెల్యేలే గ్రామాల్లో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ వారి అనుచరగణాలు గ్రామాల్లో ప్రజలపై పెత్తనం చెలాయిస్తూ భూ, ఇసుక మాఫియాలు గా మారి ఎన్నో రకాల దోపిడీలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ కుటుంబ దోపిడితో ఏడున్నర లక్షల కోట్ల అప్పుల పాలై ఆర్థిక సంక్షోభం కోరల్లోకి చిక్కుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కెసిఆర్ అతని కుటుంబము ఒక నమ్మకద్రోహులుగా మిగిలి పోయారు.

పదేళ్ల పాలనలో నరకయాతన అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం ద్వారా ఓటు హక్కుతో కేసిఆర్ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీ పాలనకు పట్టం కట్టారు.

తెలంగాణలో ప్రజా పాలన ప్రారంభమైంది.

 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే ప్రమాణ స్వీకారం రోజే నియంతృత్వ పాలనకు చిహ్నమైన ప్రగతి భవన్ ద్వారాలను ఇనుపకంచెను తొలగించాడు. పదేళ్లుగా ప్రజలకు అనుమతి ప్రగతి భవన్ లో ప్రరజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా పాలనను ప్రారంభించారు. ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరుగారంటీలలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించారు. మిగతా ఐదు గ్యారంటీల అమలు కోసం తెలంగాణలో నేటి నుండి ప్రజాపాలన గ్రామసభలు ప్రారంభించారు. గ్రామాల్లో ప్రజలంతా ఆనందోత్సవాలతో 6 గ్యారంటీల పథకాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.

 కాసిపేట మండలంలో ప్రజా పాలన గ్రామసభలు.

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఈరోజు లంబడి తండా, సోమగూడెం కే, మామిడిగూడెం,చిన్న ధర్మారం గ్రామపంచాయతీలలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. తహసిల్దార్ భోజన్న, ఎంపీడీవో ఎంఏ అలీం ఆధ్వర్యంలో రెండు బృందాలు గ్రామ సభలను నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

సోమగూడెం కె పంచాయతీలో నిర్వహించిన గ్రామసభకు అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ సపాట్ శంకర్ మాట్లాడుతూ గత కెసిఆర్ పాలనలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు కానీ, గృహ వసతి కల్పించకుండ ప్రజలకు దూరంగా ఉండి పాలన సాగించాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా పాలన ప్రారంభించింది అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు గ్రామ సభలు నిర్వహి స్తుందని అన్నారు. గ్రామ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రత్యేక అధికారి గంగారం మాట్లాడుతూ ప్రస్తుతం రేషన్ కార్డు లేని వారికి ఐదు గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించడం లేదని, గ్రామసభల తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం మళ్లీ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని కొత్త రేషన్ కార్డు పొందిన వారు అప్పుడు మళ్లీ నిర్వహించే ప్రజాపాలన గ్రామసభలు ఐదు గ్యారంటీ ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తహసిల్దార్ భోజన్న మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహించే పంచాయతీ లోని ప్రజలందరి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రస్తుతం గ్రామాల్లో లేకుండా వేరే ప్రాంతాల్లో వెళ్ళిన వారు కూడా ఆరవ తేదీలోపు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.మండల పంచాయతీ అధికారి నాగరాజు రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్రజలకు వినిపించారు. కార్యక్రమంలో పెద్దనపల్లి ఎంపీటీసీ కొండ బత్తుల రామచందర్, పంచాయతీ ఉపసర్పంచ్ కనుకుల రాకేష్, మండల వ్యవసాయ అధికారి వందన, విద్యుత్ సబ్ ఇంజనీర్ నవీన్, మండల సమాఖ్య ఏపిఎం వెంకటేశం, పిజిహెచ్ఎం రమేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.