కాసిపేట మండలంలో కాంగ్రెస్ విజయంతో పార్టీ నాయకుల సంబరాలు.

ముత్యం పల్లి లో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు.
Scv News Kasipet:--
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాలలో సంబరాలు జరుపుకున్నారు. కొండాపూర్ పల్లం గూడెం కాసిపేట గుండ్లపాడు వివిధ గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ గెలుపు కోసం కృషి చేసిన నాయకులు బాణాసంచాలు కాలుస్తూ కేకులు కట్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
కొండాపూర్ లో స్థానిక సర్పంచి మొక్కల శ్రీనివాస్,మాజీ సర్పంచి ఉత్తూర్ సత్తయ్య, కాంగ్రెస్ నాయకులు చారి, ఒల్లపు రాజు మహంకాళి లు
పల్లం గూడలో అల్లంల స్వామి, సత్యనారాయణలు ముత్యం పల్లి లో కుమారస్వామి మాజీ ఉపసర్పంచి ధారబోయిన రాజయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు బాణాసంచాలు కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
