మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాకా గడ్డం వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

 ముత్యం పల్లి  క్రీడా మైదానంలో స్వర్గీయ  కాకా గడ్డం వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

 ముత్యం పల్లి లో కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అధికారులు.



Scv News Kasipet:--

 మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని ముత్యం పల్లి క్రీడా మైదానంలో   కాక గడ్డం వెంకటస్వామి స్మారక కాసిపేట క్రికెట్ ఛాంపియన్  మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటు ఈరోజు ప్రారంభమైంది. క్రికెట్ టోర్నమెంటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో ముత్యం పల్లి కాంగ్రెస్ నాయకులు మైదం రమేష్, గోలేటి స్వామిల సారధ్యంలో  నిర్వహించ బడుతుంది.

 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రామచందర్, మండల స్పెషల్ ఆఫీసర్ గంగారం, తహసిల్దార్ భోజన్న, మండల అభివృద్ధి అధికారి  ఎం ఏ అలీ  , కాసిపేట ఎస్సై గంగారం, మాజీ జెడ్పిటిసి రైతు సత్తయ్య, ధర్మ రావు పేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంశీధర్ రావు లు హాజరయ్యారు. టోర్నమెంటులో ప్రధమంగా పోటీపడుతున్న ముత్యంపల్లి తాటి గూడెం జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకొని  ఎంపీడీవో అలీ బౌలింగ్ చేయగా కాసిపేట ఎస్సై గంగారాం బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు.

తదానంతరం  టోర్నీ నిర్వాహకులు హాజరైన ప్రముఖులంతా  కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలు సమర్పించారు.


ఈ సందర్భంగా కాసిపేట ఎస్సై గంగారం మాట్లాడుతూ  టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. గెలుపు ఓటములు సహజమని గెలిచినవారు ఏదో గొప్పగా సాధించామని, ఓడినవారు ఏదో కోల్పోయామని నిరుత్సాహ పడకుండా ఉత్సాహంగా క్రీడా పోటీలో పాల్గొనాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఫిట్నెస్ కు ఎంతో ఉపయోగపడతాయని యువకులంతా క్రీడా పోటీలలో పాల్గొనాలని సూచించారు.


టోర్నీ  నిర్వాహకుడు రత్నం ప్రదీప్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువకులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు  మైదం రమేష్, గోలేటి స్వామిల సహకారంతో కాక గడ్డం వెంకటస్వామి స్మారక  టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుం దన్నారు. క్రికెట్ టోర్నమెంట్ లో 16 జట్లు పాల్గొంటున్నాయని 10 రోజులు పోటీలను నిర్వహించడం జరుగుతుందని  పోటీలలో పాల్గొనే యువకులంతా మండల వాసులు మాత్రమేనని ప్రథమ బహుమతి పొందిన వారికి 15వేల రూపాయలు, ద్వితీయ బహుమతి పొందిన వారికి 7,500 బహుమతులుగా ఇవ్వబడు తుందని  క్రీడ పోటీల నిర్వాహకులు పోటి నిర్వాహకులు మైదం రమేష్ గోలేటి స్వామిలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, పుర కుమారస్వామి, ముత్యంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు ధారవేణి రాజయ్య, కాసిపేట కాంగ్రెస్ నాయకులు రాపర్తి శ్రీనివాస్ నర్సింగం, మాజీ ఉపసర్పంచి మేడ రామచందర్, వార్డు సభ్యుడు అగ్గి స్వామి, ధర్మారావుపేట కాంగ్రెస్ నాయకులు రాజమౌళి, జనార్దన్ రెడ్డి, దేవాపూర్ కాంగ్రెస్ నాయకులు బింగి శ్రీనివాస్, కోనూరు మాజీ సర్పంచ్ ఉత్తూర్ సత్తయ్య, తాటి గూడెం కాంగ్రెస్ నాయకులు మడావి వెంకటేష్, సోమగూడెం కాంగ్రెస్ నాయకులు తోడేటి కృష్ణ, సామాజిక చైతన్య వేదిక సలహాదారు చిన్న భీమయ్యలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, క్రికెట్ క్రీడాకారులు అభిమానులు పాల్గొన్నారు.