జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన గడ్డం మేఘనకు సామాజిక చైతన్య వేదిక, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సన్మానం.
![]() |
| మేఘనను సన్మానించిన సామాజిక చైతన్య వేదిక పద్మశాలి సంఘం నాయకులు. |
Scv News Kadipet:---
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన గడ్డం మేఘన న్యాయ విద్యలో అత్యంత ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సందర్భంగా ఈరోజు దేవాపూర్ కాలనీలోని క్వార్టర్ లో సామాజిక చైతన్య వేదిక, దేవాపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించడం జరిగింది. గడ్డం మేఘనను సన్మానించిన వారిలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, ప్రధాన సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య, సభ్యులు రెడ్డి లక్ష్మణ్, ఆత్రం మోహన్, దేవాపూర్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి సుంకరాజ మౌళి, బొల్లు దాసు, బింగి శ్రీనివాస్, వెంకటేశం, ప్రసాద్, ప్రభాకర్లు ఉన్నారు.
ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక సలహాదారు చిన్న భీమయ్య మాట్లాడుతూ మారుమూల కాసిపేట మండలం నుండి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడం మండలానికి ఎంతో గర్వకారణం అని అన్నారు. ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజన వర్గం లోని ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నతంగా చదవాలని కలలు కన్నాడని అంబేద్కర్ కలలను గడ్డం పురుషోత్తం కూతురు మేఘన నిజం చేయడం సంతోషకర మన్నారు. అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడు తూ గడ్డం మేఘన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడం కాసిపేట మండలానికి ఎంతో గర్వకారణం అని బహుజన వర్గాల విద్యార్థులు మేఘనను ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదవాలని అన్నారు. పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి సంకే రాజమౌళి మాట్లాడుతూ గడ్డం మేఘన పద్మశాలి సమాజం నుండి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. బింగి శ్రీనివాస్ మాట్లాడుతూ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన మేఘన తమకున్న ఖాళీ సమయంలో మండలంలోని యువతకు తమ విజయ రహస్యాలపై మోటివేషన్ క్లాసులు ఇవ్వాలని కోరారు.
పేద ప్రజలకు న్యాయం చేయాలని లక్ష్యంతో న్యాయ విద్యను చదివాను.
- గడ్డం మేఘన.
గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలకు సేవలు చేయాలనే లక్ష్యంతోనే న్యాయవిద్యను చదివాను.చాలామంది మొదట న్యాయవాది వృత్తిలో మగవాళ్ళ పెత్తనం ఉంటుంది, ఎలా నెగ్గుకోస్తావని ప్రశ్నించారని అయినా అధైర్య పడకుండా న్యాయవాద వృత్తిలో మా బాబాయి ఉండడం వల్ల అదే స్ఫూర్తితో న్యాయవిద్య చదివాను. న్యాయ విద్య పూర్తి చేసి సివిల్ జడ్జిగా ఎంపిక అయ్యాను. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది ఇష్టమో దానిని చదివించాలని అప్పుడే పిల్లలు నచ్చిన కోర్సు చదివి ఉన్నతంగా ఎదుగుతారు.
పిల్లలు ఉన్నతంగా ఎదగాలంటే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
-- గడ్డం పురుషోత్తం, మేఘన తండ్రి
తమ పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మేఘన తండ్రి గడ్డం పురుషోత్తం అన్నారు. మేఘన చదువుతున్నప్పుడు ఇంట్లో టీవీని ఆన్ చేసే వాళ్ళం కాదని, ఏ కోర్సులో చదువుతే ఉన్నత స్థాయికి వెళ్తుందని ఆరా తీసీ న్యాయవాద విద్య చదివించడం జరిగిందని అన్నారు. న్యాయ విద్యలో ఉన్నత శిఖరాలకు ఎదిగి సివిల్ జడ్జిగా ఎంపికపోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.


