మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

రాష్ట్రస్థాయిలో కాసిపేట మండలానికి గుర్తింపు తెచ్చిన గడ్డం మేఘన.

 జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై  కాసిపేట మండలానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిన గడ్డం మేఘన.

 జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన దేవాపూర్ కు చెందిన గడ్డం మేఘన.

Scv News kasipet:--

 రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం  మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన గడ్డం మేఘన  న్యాయ విద్యలో అత్యంత ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై మండలానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చింది.2020 లో న్యాయ విద్య ప్రవేశ పరీక్ష లోనే  రాష్ట్రంలోనే అత్యంత ప్రతిభ కనబరిచి లాసెట్లో మూడవ ర్యాంకు  సాధించి ఉస్మానియా న్యాయ కళాశాలలో  సీటు సంపాదించింది. ఉస్మానియా న్యాయ కళాశాలలో చేరి  ఎల్.ఎల్.బి లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించి రికార్డు సృష్టించిన గడ్డం మేఘన 2022లో పీజీ లా సెట్ లో రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించింది.డిసెంబర్ 1న హైకోర్టులో  నిర్వహించిన  జూనియర్ సివిల్ జడ్జిల ఎంపికలో ప్రిలిమ్స్ మెయిన్స్ లో అర్హత సాధించి సివిల్ జడ్జిగా ఎంపికైంది.

 దేవాపూర్ గ్రామానికి చెందిన మేఘన తండ్రి గడ్డం పురుషోత్తం  ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో సివిల్ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా పని చేస్తున్నారు.మేఘన చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా నిలుస్తూ ఉత్తమ ఫలితాలను సాధించి అందరి  ప్రశంసలు పొందుతుంది. స్థానిక దేవాపూర్ కార్మెల్ గిరి పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించింది. దేవాపూర్ కార్మల్ గిరి ఉన్నత పాఠశాలలో 2013/14 పదవ తరగతిలో 9.8 జిపి మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రధమంగా నిలిచింది. ఇంటర్ లో శ్రీ చైతన్య కాలేజ్ హైదరాబాదులో చదివి అత్యున్నత ఫలితం వేయిమార్కులకు గాను  960 సాధించింది. డిగ్రీ ని  కరీంనగర్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ డిగ్రీ కాలేజీలో చదివి  9.77 జి పీఎఫ్ మార్కులు సాధించింది.

 మండల యువతకు గడ్డం మేఘన ఆదర్శం.


మారుమూల గ్రామాలకు చెందిన వారైనా చదువుపై శ్రద్ధ పెట్టి చదివితే పట్టణ ప్రాంత వారికి తీసిపోకుండా ఉన్నత శిఖరాలకు వెళతారానడానికి సివిల్ జడ్జిగా ఎంపికైన గడ్డం మేఘన ప్రత్యేక నిదర్శనం.గడ్డం పురుషోత్తం దంపతుల ఏకైక కుమార్తె మేఘనకు తల్లిదండ్రులు చదువులో ఎంతో ప్రోత్సహించడం వల్ల న్యాయ విద్యలో ఉన్నత స్థాయికి వెళ్ళింది. మండలంలో కాలేజీ స్థాయిలో విద్యాబోధన చేసే యువతీ యువకులు మేఘనను ఆదర్శంగా తీసుకుని చదువు పై శ్రద్ధతో చదివితే ఉన్నత శిఖరాలకు వెళతారు.  తల్లితండ్రులు కూడా  గడ్డం పురుషోత్తం దంపతులను ఆదర్శంగా తీసుకుని వారి పిల్లల ఉన్నత చదువులకు సహకరించాలి.

 చిన్నప్పటి నుండి విద్యాభ్యాసంలో ఉత్తమ ఫలితాలను సాధించి కాసిపేట మండలానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిన గడ్డం మేఘనకు కాసిపేట మండల వాసులు,సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది.