మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో డ్రాప్ అవుట్ విద్యార్థుల గుర్తింపు సర్వే.

 కాసిపేట మండలంలో  డ్రాప్ అవుట్ విద్యార్థుల గుర్తింపు సర్వే.

ScvNews Kasipet:--

 కాసిపేట మండలం ధర్మారావు పేట జిల్లా పరిషత్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని గ్రామాలలో పడి బయట ఉన్న పిల్లల గుర్తింపు కోసం డ్రాప్ అవుట్ సర్వే ఈరోజు నిర్వహించారు. కాంప్లెక్స్ పరిధిలోని సిఆర్పి మడావి తిరుపతి లక్షింపూర్ కోలం గూడెం హబ్బిటేషన్ పరిధిలో నలుగురు పిల్లలను బడి బయట ఉన్నట్టుగా డ్రాప్ అవుట్ సర్వేలో  గుర్తించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ 6 నుండి 19 సంవత్సరాలలో పిల్లలు బడి బయట ఉండవద్దని తల్లిదండ్రులకు తెలిపామని, పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న విద్యాబోధన వసతుల విషయమై తెలియజేయడం జరిగిందని అన్నారు. ఈ సర్వేలో గుర్తించిన పిల్లలను ప్రబంధ పోర్ట్ లో నమోదు చేసి పిల్లలకు వయసుకు తగిన తరగతిలో పాఠశాలలో చేర్పించడం జరుగుతుందని అన్నారు. 15 నుండి 19 సంవత్సరాల బడి బయట పిల్లలను ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్లో చేర్పించడం జరుగుతుందని ఈ సర్వేలో కులగుడం పాఠశాల హెచ్ఎం సమ్మయ్య పాల్గొన్నారు అని తెలిపారు.