మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల బారాస కంచుకోటకు బీటలు.

 

అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేని భరాస శ్రేణులు.

 దుర్గం చిన్నయ్య ను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్న బారాస కార్యకర్తలు.(పాత చిత్రం )


Scv News Kasipet:--

అమరుల త్యాగ ఫలితంగా వచ్చిన  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు కెసిఆర్ ప్రభుత్వం నిరంకుశ పాలనను అందించి ప్రజాగ్రహంతో ఇటీవల ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయాడు. కెసిఆర్ ప్రభుత్వం ఓటమిని రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకు  బారాస శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. మితిమీరిన అహంకారం, అధికార మదంతో ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని   ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన కెసిఆర్ సర్కార్ పతనం అవ్వడం రాష్ట్ర ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. గత 10 ఏళ్లుగా  బరాస పాలనలో రాష్ట్రస్థాయి నుండి మండల స్థాయి వరకు పరిపాలన స్తంభించిపోయింది. ఏ ఒక్క శాఖ అధికారులు స్వతంత్రం గా ప్రజల కోసం పనిచేస్తామన్న చేయాలేని పరిస్థితి.

తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం దోపిడీ చేస్తే, నియోజకవర్గాల్లో  ఎమ్మెల్యేలకు పూర్తి అధికారాలు ఇవ్వడంతో ప్రతి శాఖలో జోక్యం చేసుకొని ఏ అధికారులను కూడా పనిచేయకుండా  ఎమ్మెల్యే వారి అనుచర గణాలు ప్రభుత్వ పాలనను ప్రజలకు అందకుండా చేశారు. ఎమ్మెల్యేల అండా చూసుకొని మండల, గ్రామస్థాయి నాయకులు విచ్చలవిడిగా భూ దందాలు, ఇసుక దందాలు  అవినీతి అక్రమాలు చేస్తూ పోలీసు, రెవెన్యూ,మండల పరిషత్ అధికారుల పై జలుమ్ చేస్తూ పేద ప్రజలను నానా రకాలుగా హింసించారు. ఉద్యమ పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చి అవినీతి, అక్రమాలను వ్యతిరేకించిన వారిని, ప్రజలకు అన్యాయం చేయడం తప్పని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడుతూ పోలీసు కేసులు పెట్టి నానారకాల హింసలకు గురి చేశారు. వీరి గత తొమ్మిదేళ్ల దుష్ట పాలనకు ప్రజలు చరమగీతం పాడడంతో  గ్రామాలలో భరాస నాయకులు ప్రజల్లో తిరగడానికి ముఖం చాటేస్తున్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాల చిట్టా విప్పుతుండడంతో గ్రామాలలోని భరాసా నాయకులు ప్రజల ముందుకు వచ్చేందుకు సిగ్గుపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం చేయకుండా ఇబ్బందు లు పెట్టి నియంతృత్వ వైఖరి అవలంబించిన ఏ ప్రభుత్వమైనా ప్రజల అగ్రహానికి గురికావడం సహజం. ఈ చారిత్రక సత్యాన్ని రాజకీయ నాయకులు గుర్తించి మసులుకోవడం నేర్చుకోవాలి.

కాసిపేట మండల బారాస  కంచుకోటకు బీటలు.

బెల్లంపల్లి నియోజకవర్గంలో  భరాస పార్టీకి  గత పదేళ్లుగా కాసిపేట మండలం కంచుకోటగా నిలిచింది. గత రెండు ఎన్నికల్లో నియోజకవర్గంలో  కాసిపేట మండలంలోని అత్యధిక ఓట్లు పోలవడంతో దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2018 ఎన్నికల్లో బీఎస్పీ నుండి పోటీ చేసిన వినోద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు బెల్లంపల్లి మున్సిపాలిటీ లో దుర్గం చిన్నయ్య పై లీడ్ వచ్చి కాసిపేట మండలం లోని  3000 ఓట్లు తగ్గడంతో ఓడిపోవడం జరిగింది. మండలాన్ని గత పదేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి పరిచామని ఈసారి ఎన్నికల్లో కూడా దుర్గం చిన్నయ్య కు హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ప్రగల్ బాలు పలికిన బరాస నాయకులకు మండల ప్రజలు ఇటీవల ఎన్నికల్లో షాక్ ఇచ్చారు. 

మండలంలోని వివిధ గ్రామాల్లో పోలైన ఓట్లలో  50 శాతంకు పైగా ఓట్లు వినోద్ కి వచ్చాయి. మండలంలో 26,518 ఓట్లు ఉండగా  పోలైన ఓట్లు 21,163  కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ కు 12,353 ఓట్లు రాగా  సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు 6,690ఓట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికలకు ప్రతీకారంగా మండలంలో 5,663 ఓట్ల మెజారితో గడ్డం వినోద్ గెలుపొందాడు.

గత పదిహేళ్లుగా బహుజన వర్గానికి చెందిన దళిత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధికారంలో ఉన్న  ఏ రోజు కూడా వారికి అండగా నిలవలేదని విమర్శలు ఉన్నాయి.జనాభాలో ఐదు శాతం కూడా లేని అగ్ర కులాలకు చెందిన  వెలమ,రెడ్ల నాయకులకే  ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి.మండలంలో జెడ్పిటిసి, ఎంపీపీ, సర్పంచులు ఎంపీటీసీ లాంటి ప్రజా ప్రతినిధులు బహుజన వర్గాల వారే 99 శాతం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ పదవులు లేని అగ్రకుల నాయకులకే ప్రాధాన్యత ని ఇచ్చాడు.వారి చెప్పుడు మాటలతో  బహుజన వర్గాల్లోని నాయకులను  ఎన్నో రకాలుగా వేధింపులు ఇబ్బందు లకు గురి చేయడంతో గ్రామస్థాయిలో వారంతా  తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.ఎన్నికల సమయంలో కూడా మూడు చోట్ల కాసిపేట, ధర్మారావుపేట్, దేవాపూర్ ప్రాంతాల లోని ప్రచార బాధ్యతలను అగ్రకులాల నాయకులకు అప్పచెప్పారు. అసంతృప్తికి గురైన బహుజన వర్గాల నాయకులు  దుర్గం చిన్నయ్య గెలుపు కు కృషి చేయలేదని ప్రచారం కూడా జరిగింది. ప్రచార బాధ్యతలు తీసుకున్న అగ్రవర్ణాల నాయకులు అధిష్టాన వర్గం నుండి వచ్చిన నిధులను కిందిస్థాయిలో పంచకుండా సొంతానికి వాడుకున్నారని, కొన్ని గ్రామాలలో పోలింగ్ రోజు పనిచేసిన కార్యకర్తలకు డబ్బులు నేటికీ  కూడా ఇవ్వలేదని ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గత పది ఏళ్లుగా తెలంగాణలో  రాక్షస పాలనను అందించిన  ప్రజల ఆగ్రహానికి గురై తెరాస ప్రభుత్వం అంతం కావడం, మండలంలో తరతరాలుగా రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్న అగ్రకుల నాయకుల పీడ విరగడయినందుకు మండల ప్రజలు హర్షం  వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు కోరుకొని  తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని  బహుజన వర్గాలపై అహంకారపూరితంగా వ్యవహరించే అగ్రకుల నాయకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా బహుజన వర్గాల నాయకులను ప్రోత్సహించి మండలాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కాసిపేట మండల ప్రజలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు  .