మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీ యు సినీ గెలిపించండి. దాగం మల్లేష్

 సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో కార్మికుల హక్కుల కోసం ప్రాణ త్యాగం చేసిన ఎఐటీయు సీని గెలిపించండి.

- సర్కార్ సంఘాల ప్రచారాన్ని నమ్మి కార్మిక వర్గం  మోసపోవద్దు.

- బెల్లంపల్లి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ పిలుపు.

 విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దాగం మల్లేష్ 


Scv News Kasipet:--

 సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ ఎన్నో ప్రాణ త్యాగాలు చేసిన సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటిసిని సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల్లో గెలిపించాలని బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ కోరారు. ఈరోజు కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సింగరేణి ఆవిర్భావము నుండి ఏఐటీయూసీ కార్మికుల హక్కులను కాపాడడంలో, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టిందన్నారు. ప్రస్తుతం సింగరేణిలో అమలవుతున్న  లాభాల బాట, రఘునాథరెడ్డి అవార్డు,  కార్మికుల పించను, లాభాల బోనస్ లాంటి హక్కులని ఏఐటిసి పోరాటాల ద్వారానే వచ్చాయని కార్మికులు గుర్తు చేసుకోవాలన్నారు.సింగరేణి కార్మికులు సర్కారు సంఘాల మాటలు నమ్మి మోసపోవద్దని  కోరారు. సర్కార్ సంఘాలను గుర్తింపు సంఘాలుగా ఎన్నుకుంటే వారు కార్మికుల హక్కుల కోసం మాట్లాడరని, సమ్మెలు చేయరని యాజమాన్యాన్ని నిలదీయలేరని అ న్నారు. సర్కార్ సంఘ నాయకులు ప్రభుత్వం పేరు చెప్పి పైరవీలు చేసి కార్మికులను దోచుకోవడమే తప్ప కార్మికుల మేలు చేయరని అన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గత పదేళ్లుగా సింగరేణి కార్మికులను సంస్థను ఎలా దోపిడి చేసిందో కార్మికులకు తెలుసని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టియుసి సర్కార్ సంఘం గతంలో ఒకసారి గెలిపిస్తే ప్రభుత్వ అండతో టీబీజీకే స్ మాదిరిగానే కార్మికులను దోచుకుందని గుర్తు చేశారు. ఐ ఎన్ టి యు సి నాయకుకులు కార్మికుల వద్ద ప్రతి పనికి క్వార్టర్లకు ట్రాన్స్ఫర్లకు, కూడా లంచాలు తీసుకున్న విషయం కార్మికులు గుర్తు చేసుకోవాలన్నారు. ఈనెల 27న జరిగే ఎన్నికల్లో సింగరేణి కార్మికులు చుక్క గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.

 సిపిఐ అనుబంధ  సంస్థ భవన కార్మిక సంఘం జిల్లా నాయకుడు జాడిపోచం మాట్లాడుతూ సర్కార్ సంఘాలను గుర్తింపు సంఘం గా ఎన్నుకుంటే కార్మికులకు నష్టమని గత సర్కార్ సంఘం సింగరేణి సంస్థ నిధులను సింగరేణిలో కర్చు పెట్టకుండా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కు తరలించిందని గుర్తు చేశారు.  సిపిఐ మండల కార్యదర్శి సర్వేశం మాట్లాడుతూ సింగరేణి ఎన్నికల్లో కార్మికుల హక్కులను కాపాడే ఏఐటిసిని గెలిపించాలని కోరారు. కాసిపేట టు గని ఏఐటియుసి నాయకుడు పులి శంకర్ మాట్లాడుతూ కార్మికులు సర్కార్ సంఘాల నమ్మకుండా ఏఐటీయూ సి ని ఎన్నికల్లో గెలిపించాలని  ఎన్నికల ప్రణాళికలో వెల్లడించిన 40 హక్కులను సాధించి పెడుతుందని అన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు దాగం రాయలింగు,కృష్ణ పాల్గొన్నారు.