మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో బిఆర్ఎస్ ను వీడుతున్న సర్పంచులు ఉప సర్పంచులు.

 కాసిపేట మండలంలో బిఆర్ఎస్ ను  వీడుతున్న సర్పంచులు ఉప  సర్పంచులు.



 బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఉప సర్పంచ్లు, సర్పంచి వార్డు సభ్యుడు.  

Scv News Kasipet:--

 కాసిపేట మండలంలో నిన్నటి వరకు తిరుగులేని శక్తిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉదృతం అవుతున్న కొద్దీ సర్పంచులు, ఉప సర్పంచ్లు  వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటుండడంతో బలహీన పడుతుంది. ఆదివారం కోమటి చేను గట్రావ్ పెళ్లి సర్పంచులు రామ టెంకి శ్రీనివాస్, పింద్రం రాజు, కో ఆప్షన్ సభ్యులు సిరాజ్ ఖాన్ లు బి ఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 ఈ రోజు కాసిపేట మండల అధ్యక్షులు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో కాసిపేట మండల  ఉప సర్పంచులు లంబడితండా(కే) జర్పుల తిరుమల్,మామిడిగూడెం ఉప సర్పంచ్ నగవాత్ భాస్కర్,పల్లంగుడా ఉప సర్పంచ్ రంగు సతీష్, లంబడి తండా ఉప సర్పంచ్ రాజేష్, కాసిపేట మేజర్ పంచాయతీ 8వ వార్డు సభ్యుడు అగ్గి స్వామి లు బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

మండలంలోని వివిధ గ్రామాలలో సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో  చేరుతుండ డంతో రోజురోజుకు మండలంలో కాంగ్రెస్ పార్టీ పట్ల జోష్ పెరుగుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోని  రెండు గ్రూపుల సమన్వయం లేక ఎవరికి వారు యమునా తీరే అనే రీతిలోనే ప్రచారం సాగిస్తుండడం వారికి ప్రతికూలంగా  మారింది. పదేళ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పట్ల ఆదరణ చూపుతున్న  మండలంలో నాయకుల మధ్య సమన్వయం లేక ప్రజలు ఆశిస్తున్న స్థాయిలో ప్రచారం జరగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ధర్మారావుపేట్ దేవాపూర్ ముత్యం పల్లి, కాసిపేట తో పాటు వివిధ గ్రామాలలో మరోసారి కెసిఆర్ ప్రభుత్వానికి ఓటేయాలని దుర్గం చిన్నయ్యను గెలిపించాలని ఉదృతంగా  ప్రచారం నిర్వహిస్తున్నారు.