మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో గుంతల మయమైన రోడ్లు, అవస్థలో ప్రజలు.




Scv News Kasipet :--

 ఆంధ్ర వలసవాదులపై దశాబ్దాలుగా పోరాటం చేసి వేలాదిమంది విద్యార్థుల అమరుల త్యాగ ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచామని  ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి తమనే గెలిపించాలని బిఆర్ఎస్ నాయకులు గ్రామాల లో ప్రచారం చేస్తూ  ప్రజలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కాసిపేట మండలంలో గత పదేళ్ల ఉద్యమ పార్టీ పాలనలో గ్రామాలలో రహదారులు అభివృద్ధి జరిగిందా?అని క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజలను అడిగితే అసలు విషయాలు తెలుస్తాయి. నేటికీ మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు లేక  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం Scv News పరిశీలనలో తేలింది.

 పదేళ్ల కాలంలో మీడియా గొంతు నులిమిన ఉద్యమ పార్టీ.

ప్రజల గొంతు గా మారిన సోషల్ మీడియా.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో గ్రామాలలో ప్రజా సమస్యల ను వెలుగులోకి తెచ్చి పరిష్కరిం చేందుకు కృషి చేయాల్సిన మీడియా గొంతును అధికార పార్టీ నులిమి వేసింది. పాలకుల ఒత్తిడికి జంకి ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన మీడియా తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడం లేదనే  విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నుండి ఒత్తిళ్లు, బెదిరింపులు పత్రికా యాజమాన్యాలు ప్రభుత్వం ఇచ్చే కోట్లాది రూపాయల ప్రకటనల ప్రలోభాలకు లొంగడం అనే వాదనలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వంలోని పెద్దలు పత్రికలను, మీడియా సంస్థలను కొనుగోలు చేసుకుని తమకు అనుకూలమైన వార్తలని ప్రసారం చేయడం వల్ల ప్రజల అసలు సమస్యలు పక్కదారి పట్టాయనే విమర్శలు కూడా ఉన్నాయి. తెలంగాణ పల్లెల్లో ప్రజల బాధలను సమస్యలను బాహ్య ప్రపంచానికి వెల్లడించేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లో కల్పించిన ఆర్టికల్ 19 లోని వాక్ స్వాతంత్రం ఆధారంగా వెలసిన సోషల్ మీడియా వేదిక అయింది. ప్రధాన మీడియా మొత్తం ప్రభుత్వానికి లొంగిపోయి నిద్ర వస్తలో ఉంటే సోషల్ మీడియా ప్రజల గొంతు గా నిలిచి ప్రజల సమస్యలను,కష్టాలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రభుత్వ అవినీతి,అక్రమాలపై పోరాడుతుంది. సోషల్ మీడియా పై ప్రభుత్వ పరంగా ఎన్నో రకాల వేధింపులు పోలీసు కేసులు, నిర్బంధాలు విధించిన నిష్పక్షపాతంగా సోషల్ మీడియా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంది. అందులో భాగంగానే కాసిపేట మండలంలో ప్రజల గొంతుకగా నిలిచి  Scv News  సోషల్ మీడియా  ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తుంది.

గతపదేళ్ల తెలంగాణ పాలనలో మండలంలోని అన్ని గ్రామాలలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పరిచామని, గ్రామాల సమస్యలు తీర్చడంతో    ప్రజలంతా ఆనందోత్సవాలతో ఉన్నారని, మరొకసారి గెలిపించాలని అధికార పార్టీ నాయకులు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు.మండలంలో గత పదేళ్ల తెరాస పాలనలో నాయకులు ప్రచారం చేసుకున్నంత కాకున్నా కొంత అభివృద్ధి జరిగింది మాత్రం వాస్తవం. చాలా గ్రామాలలో ప్రజల తక్షణ అవసరాలను తీర్చకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారనేది కూడా నిజం. ప్రజా సమస్యలను, వారి బాధలను వెలుగులోకి తెచ్చిన వారిని కొంత మంది అధికార పార్టీ నాయకులు తమ తప్పులను ఎత్తి చూపినందుకు విమర్శించడం వేధింపులకు, బెదిరింపు లకు గురి చేయడం జరుగుతుంది. ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే వాటిని సరిదిద్దుకోకుండా కక్ష సాధింపులకు పాల్పడడం 'అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరు' అన్న చారిత్రక సత్యాన్ని నాయకులు విస్మరించడమే అవుతుంది.

మండలంలోని ప్రధాన మీడియా వివిధ కారణాలతో గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలను పట్టించుకోలేక మౌనంగా ఉన్న  ఈ సమయంలో  మండల ప్రజల గొంతుకగా Scv News సోషల్ మీడియా నిలిచి ఇటీవల కాలంలో  ఎన్నో కథనాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. సోనాపూర్, గట్రావ్ పెళ్లి పంచాయతీల లో విష జ్వరాలతో మరణిస్తున్న గిరిజనుల గురించి, పదేళ్ల తెలంగాణ ప్రభుత్వంలో నయా పైసా కూడా అభివృద్ధి నిధులు విడుదల చేయని తుడుం గూడెం  గ్రామం గురించి, దట్టమైన అడవి కొండల మీద  పకృతి ఒడిలో వ్యవసాయంగా చేసుకుంటూ హాయిగా బతికిన కుర్రేగాడువాసులను  మైదాన ప్రాంతానికి తీసుకువచ్చి వారిని జీవితాలను ఆగం చేసిన పాలకుల నిర్లక్ష్యం గురించి, 19 ఏళ్లుగా 13 కోట్ల వ్యయం చేసిన సల్పవ వాగు  చెరువు ఎకరం భూమికి సాగునీరు అందించడం లేదని నగ్న సత్యాలను వెలుగులోకి తేవడం జరిగింది.



ప్రజా సమస్యలపై కథనాల రాస్తే  తట్టుకోలేక దుష్ప్రచారాలకు దిగుతున్న అధికార పార్టీ నాయకులు.

 గత పదేళ్ల పాలనలో గ్రామాలలో ప్రజా సమస్యలు తీరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వార్త కథనాలు ఇస్తే అధికార పార్టీ నాయకులు తట్టుకోలేక దుష్ప్రచారాలకు దిగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాతో పాటు ప్రధాన పత్రికలో వచ్చిన వార్త కథనాలను జీర్ణించుకోలేని కొంతమంది అధికార పార్టీ నాయకులు  వార్తలు రాసే పాత్రికేయులు  వేరే  పార్టీలకు తొత్తులుగా మారారని దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. అధికార పార్టీని భుజాన మోసే ఒక నాయకుడు పత్రికలో వచ్చే వార్తలను ఖండిస్తూ  69 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం  చేశారని? వాట్సప్ గ్రూపులో  పోస్టులు చేయడం జరిగింది. మీ పదేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పకుండా ఎదురు దాడికి దిగడం అవగాహన లేనిపోస్టులు పెట్టి వారి అజ్ఞానాన్ని వెల్లడించడం పట్ల నెటిజెన్లు నవ్వుకుంటున్నారు. పత్రికలు,సోషల్ మీడియా ఎప్పుడు  ప్రజల పక్షాన నిలిచి వాస్తవాలు వెల్లడిస్తాయనే నిజం నాయకులు తెలుసుకోవాలి.

 పదేళ్ల తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని గ్రామాలకు రహదారులు వేసిన మాట వాస్తవం.

 - ప్రజలకు అత్యవసరమైన రోడ్లను విస్మరించారనే విమర్శలు కూడా ఉన్నాయి.

 గ్రామీణ సడక్ యోజన పథకం కింద గురువాపూర్ చింతగూడెం గ్రామాల మధ్య వేసిన బిటి రహదారి.

ఆuధునిక కాలంలో రవాణా సౌకర్యాలే గ్రామాల అభివృద్ధికి కీలకం. గత పదివేల తెలంగాణ ప్రభుత్వ పాలనలో కాసిపేట మండలంలో మారుమూల గిరిజన గూడాలైన పెద్దపూర్, గురువా పూర్ చింతాగూడెం మామిడిగూడెం గ్రామాలకు తీవ్రవాద పీడిత గ్రామాల అభివృద్ధి పథకం కింద ప్రధానమంత్రి సడక్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సుమారు15 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో మండల ప్రధాన రహదారి నుండి గ్రామాలకు బీటి రోడ్లు వాగులపై వంతలను నిర్మించడం జరిగింది. ఈ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం  డీఎంఎఫ్టి,మినరల్ ఫండ్ నిధులతో అపూర్ ముత్యం పల్లి కాసిపేట మండలంలోని పంచాయతీల కేంద్రాలలో సుమారు 10 కోట్ల నిధులతో సిమెంటు రహదారులను నిర్మించింది కాదనలేని నిజం. ప్రజలకు ఉపయోగపడే తక్షణ అవసరమైన రహదారులు వంతెనల పట్ల కూడా పదేళ్ల కాలంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారన్నది ఆయా గ్రామాల ప్రజల నుండి వస్తున్న విమర్శలు.

  • అధికారపక్షం పదేళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన రహదారుల వివరాలు ఇలా ఉన్నాయి.

 కంకర తేలిన నాయకపు గూడెం  రహదారి .

దేవాపూర్ నాయక గూడెం నుండి సోనాపూర్  ప్రధాన రహదారి ని కలిపే రోడ్డు అద్వాన స్థితిలో ఉంది.  సోనాపూర్ గట్రావ్ పెళ్లి పంచాయతీల పరిధిలోని సుమారు 16 గ్రామాల ప్రజలు ప్రతిరోజు తమ నిత్యవసర వస్తువుల కోసం ఈ రహదారి గుండానే దేవపూర్ మేజర్ పంచాయతీకి వస్తుంటారు. ఇదే రహదారిలో దేవపూర్ పంచాయతీ ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం ఉంది. రెండు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రహదారి గుంతల మయమై కంకర తేలి ఉంది. ద్విచక్ర వాహనం, ఆటోలు ఎడ్లబండి కూడా గుంతలలో పడి వెళ్లడం  ప్రజలను తీవ్ర అసౌకర్యాలకు గురిచేస్తుంది. ఈ రహదారిని బీటీ లేదా సిమెంటు రహదారిగా మార్చాలని స్థానిక గిరిజన లు గిరిజన సంఘాల నాయకులు గత 15 ఏళ్లుగా అధికారులకు నాయకులకు విన్నవిస్తూనే ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోపోటీ చేసే నాయకులకు ఆ గ్రామం తరపున ప్రధానమైన డిమాండ్ వినిపిస్తున్నారు. రెండుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దృష్టికి కూడా ఎన్నోసార్లు తీసుకువచ్చిన సమస్యను పరిష్కరించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ ప్రాంత సహజ వనరులు తరలిస్తూ కోట్లాది రూపాయల లాభాలతో నడుస్తున్న  పక్కనే ఉన్న ఓరియంట్ సిమెంట్ యాజమాన్యంతోనైనా ఈ రహదారి పనులు చేయించాలని స్థానిక గిరిజనులు అధికార పార్టీ నాయకుల దృష్టికి దశాబ్ద కాలంగా కోరుతున్న పట్టించుకోలేదని వాపోతున్నారు.  

భూమి పూజ చేసి సంవత్సరం గడుస్తున్న రోడ్డు పనులు ప్రారంభం కాలేదని దుబ్బగూడెం వాసుల ఆవేదన.

 కంకర తేలిన దుబ్బగూడం రహదారి.
మండల కేంద్రం కు సమీపంలోని ముత్యం పెళ్లి పంచాయతీలోని దుబ్బగూడం  రహదారి పరిస్థితి మరోలా ఉంది. మండల ప్రధాన రహదారి నుండి రెండు కిలోమీటర్ల దూరం ఉన్న దుబ్బగూడం గ్రామం రోడ్డు గుంతల మాయమై అద్వానంగా ఉంది. కంకర తేలి ఆ గ్రామానికి ద్విచక్ర వాహనాలు ఆటోలు వెళ్లలేని పరిస్థితి ఉంది. గ్రామానికి బిటి రహదారి వేయాలని దశాబ్దాలుగా  గ్రామ గిరిజనులు వేడుకుంటున్నారు. గత సంవత్సరం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఐటిడిఏ అధికారులతో మాట్లాడి రోడ్డు నిర్మాణం కోసం సుమారు కోటి రూపాయలకు నిధులను మంజూరు చేయించారు. నిధులు మంజూరైన తర్వాత గ్రామంలో వచ్చి  గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ చేసి వెళ్లారు. రహదారి పనులు చేజిక్కించుకున్న అధికార పార్టీ నాయకులు పనులు ప్రారంభించకుండా అమెరికా పర్యటనకు  జరిగింది. ఇటీవల వచ్చి పనులు ప్రారంభిస్తానని ప్రోక్లైన్ తెచ్చి రోడ్డు ఇరువైపులా శుభ్రం చేస్తుంటే ఇరువైపుల పత్తి వేసిన రైతులు పనులను అడ్డుకున్నారు. ఈ లోగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పనులు నిలిచిపోయాయి. రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరైన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మల్కా పెళ్లి ధర్మారావుపేట గ్రామాల మధ్య లో ఉన్నా రాళ్లవాగు పై   వంతెన లేక గ్రామస్తుల అవస్థలు.
మల్కపెల్లి ధర్మారావు పేట గ్రామాల మధ్యన ప్రవహిస్తున్న రాళ్లవాగు పై వంతెన లేక రెండు గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల రెండు గ్రామాల ప్రజలు వెళ్లలేని పరిస్థితి ఉంది. మల్కపల్లి గ్రామం నుండి నిత్యం విద్యార్థులు ధర్మరావుపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విద్యాబోధనకు వెళ్లాల్సి ఉంది. వాగులో నుండి చిన్న పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడు తున్నారు. ధర్మారావుపేట నుండి మల్కేపల్లి వారిలో ఉన్న పంట పొలాలకు రైతులు వెళ్లాలన్న కూలీలు వెళ్లాలన్నా ఈ వాగు పెద్ద అడ్డంకిగా మారింది. 30 ఏళ్లుగా ఈ వాగు పై వంతెన నిర్మాణాల కోసం ప్రతిపాదనలు జరిగి నిధులు మంజూరు కూడా స్థానిక నాయకుల నిర్లక్ష్యం వల్ల పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం  తెరాస పాలనలో కూడా వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయని, టెండర్లు కూడా పిలిచారని స్థానిక అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు తప్ప పనులు జరగడం లేదు.
మండల ప్రధాన రహదారి కొండాపూర్ రహదారి పరిస్థితి చూసి అధికార పార్టీ నాయకులు సిగ్గుపడాలి .

 వర్షాకాలంలో గుంతల మాయమైన కొండాపూర్ రహదారి 
మండల ప్రధాన రహదారి కొండాపూర్ చౌరస్తాలో ని రహదారి గత మూడు సంవత్సరాలుగా రోడ్డుపై నీరు నిలిచి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ ప్రధాన రహదారి సమస్యను తీర్చాలని గ్రామస్తులు ఎన్నోసార్లు కోరిన పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్న  అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు  మళ్లీ మాకు  ఓటే యాలని అడగడానికి సిగ్గుపడాలని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికార పార్టీలకు చెందిన నాయకులు  ప్రభుత్వ నిధులతో నిర్మించిన  వర్షపు నీరు వెళ్లే డ్రైనేజీలను కూలగొట్టడం, నీరు వెళ్లకుండా అడ్డగించడంతో  వర్షపు నీరంతా  రోడ్డుపై నిలిచి వాహనదారు లకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. భారీ వర్షాలకు రోడ్డుపై నిలిచిన నీరు పక్కనే ఉన్న వడ్డెర గూడెం లోని పేదల ఇండ్లలో నుండి బయటకు వెళుతు న్నాయి.వర్షాకాలంలో మూడు నెలలు వరద నీటి ఇబ్బందులతో  పేదలు బిక్కు బిక్కున జీవనం సాగిస్తున్నారు. రోడ్డుపై గుంతల్లో పడి ద్విచక్ర వాహన దారులు గాయాల పాలవుతున్నారు. ఆటోలు, బస్సులు,లారీలు గుంతలో పడి చెడిపోయి నష్టపోతున్నారు. మండల ప్రధాన రహదారి పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్న ఎవరూ పట్టించుకోరా అని నీటి  గుంతల నుండి వెళ్లే ప్రయాణికులు అధికార పార్టీని,నాయకులను దూషించని వారు లేరు. అయినా నాయకులకు చీమకుట్టినట్టు లేదు. పైగా రోడ్డు పై నీరు నిల్వకుండా డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని త్వరలో పనులు చేపడతామని గత సంవత్సర కాలంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని నాయకులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గత రెండు సంవత్సరాలుగా ప్రధాన రహదారి గుంతలపై ప్రయాణిస్తూ రోడ్డుపై నీరు నిల్చడానికి కారణం ఎవరు? గ్రామ సర్పంచి కార్యదర్శి ఏం చేస్తున్నాడని ఒక్కరోజు కూడా అడగలేదని గ్రామస్తులు  విమర్శిస్తున్నారు. వర్షాలు తగ్గడంతో ప్రస్తుతం రహదారిపై వాహనాలు సాఫీగా వెళుతున్నాయి. ఎన్నికల తదానంతరమైన రహదారిపై నీరు నిలవకుండా డ్రైనేజీని నిర్మించి ప్రభుత్వ నిధులతో నిర్మించిన డ్రైనేజీని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


ఈ రహదారులే కాకుండా మండలంలోని కుర్రే గాడ్ లక్ష్మిపూర్, తుడుం గూడెం దొడ్డిగూడెం, సోనాపూర్ నాయకపు గూడెం, లక్ష్మీపూర్, తిరుమలాపూర్ రొట్టెపల్లి లాంటి గిరిజన గూడా లకు రహదారులు వాగులపై వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. వీటిలోని కొన్ని గ్రామాలకు  గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రహదారులు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని  ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఒకరోజు ముందు ఎమ్మెల్యే హడావిడిగా మండలంలో రోజంతా పర్యటించి భూమి పూజలు చేశారు. భూమి పూజ చేసిన రహదారులు వంతెనలకు ఎన్నికల్లో మళ్లీ గెలిచిన వెంటనే పనులు పూర్తి చేస్తామని అధికార పార్టీ నాయకులు గ్రామాలలో ప్రచారాలు చేసుకుంటున్నారు.

ఇలాంటి ప్రజల తక్షణ అవసరాల అయిన పనులకు ప్రాధాన్యతనిచ్చి పనులు పూర్తి చేయడంలో అధికార పార్టీ నాయకులు తీవ్ర నిర్లక్ష్యం చేశారని విమర్శలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. ఈ పనులు చేయడంలో తమ తప్పులు జరిగాయని నిజాయితీగా ఒప్పు కోకుండా ఇంకా ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసపు మాటలతో  మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసం అని  మండలవాసులు  ప్రశ్నిస్తున్నారు.