మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

13 కోట్ల నిధులు వ్యయమై ఎకరం భూమికి సాగునీరిందించిన సల్ఫలవాగు చెరువు.

 


  13 కోట్ల నిధులు వ్యయమై ఎకరం భూమికి సాగునీరు అందించక నిరుపయోగమైన  మారిన సల్పలవాగు చెరువు.

 మూడు ప్రభుత్వాల హాయంలో మూడు పార్టీలను మార్చి పనులు కొనసాగిస్తున్న గుత్తేదారు.

-  తెరాస ప్రభుత్వ హాయంలో చెరువు మరమ్మతు పనుల కోసం 4.5 కోట్ల మిషన్ కాకతీయ నిధులు విడుదల.

- చెరువు నిర్మాణం పేరిట లబ్ధి పొందిన అధికార పార్టీలకు చెందిన అగ్రకుల గుత్తేదారులు .

- ప్రభుత్వ ధనం వృధాతో బహుజన వర్గాల రైతులకు తీవ్ర అన్యాయం.

 చెరువు నిర్మాణం పూర్తయి మత్తడి పారుతున్నప్పుడు మరియు గండిపడ్డ పాత చిత్రాలు.

 ప్రస్తుతం స్వల్పల వాగు చెరువు పరిస్థితి, కుడి కాలువ గండి పడిన దృశ్యం, ఎడమ కాలువ సంపూర్తిగా నిలిచిపోయిన దృశ్యాలు.


Scv News Kasipet:-

 దేశ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనే మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోమటి చేను శివారులోని సల్ఫల వాగు చెరువు పనుల నిర్మాణంలో రికార్డులు సృష్టిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో  2003లో చెరువు మంజూరు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో 2004లో చెరువు పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారుకు పనులు అప్పచెప్పారు. చెరువు పనులు కాంగ్రెస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో పూర్తికాలేదు. 2014 కొట్లాడి సాధించు కున్న బంగారు తెలంగాణ ప్రభుత్వ హాయంలో  పదేళ్ల కాలంలో కూడా కొనసాగడం దేశ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ చరిత్రలోనే రికార్డు సృష్టిస్తుంది. చెరువు నిర్మాణం 2008లో పూర్తయి గత 13 ఏళ్లుగా చెరువు నిండా పుష్కలంగా నీరు నిలువ ఉంటుంది.

కాలువల నిర్మాణం చేపట్టిన అగ్రకుల గుత్తేదారు  మూడు ప్రభుత్వాలలో మూడు పార్టీలను మార్చి పనులను కొనసాగిస్తూనే ఉన్నాడు. Lచెరువుల నిర్మాణ సమయంలో కాలువల నిర్మాణ వ్యయం 1.5 కోట్లు నిర్ణయించి టెండర్ పిలిచి పనులను అప్పజెప్పారు. వివిధ కారణాలతో పనుల్లో జాప్యం జరిగా యని  నిర్మాణ ఖర్చులు పెరిగాయని  తాను ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నుండి మిషన్ కాకతీయ ద్వారా 2016 సంవత్సరంలో కాలువల నిర్మాణానికి 4.5 కోట్లు మంజూరు చేయించు కున్నాడు. ఈ నిధులతో పనులు ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్న నేటి వరకు ఎడమ కాలువ కింద ఎకరం భూమికి సాగునీరు అందించలేదు. ఈ వర్షాకాలంలో పూర్తయిన కుడి కాలువ కూడా గండిపడి నీరంతా వృధాగా పోతుంది. సాగునీటి నిర్మాణంలో దేశంలోనే రికార్డు బద్దలు కొడుతున్న సల్ఫల వాగు చెరువుపై 'Scv News ' అందిస్తున్న ప్రత్యేక కథనం...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బడుగు బహుజన వర్గాలకు చెందిన బీడు భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో  అసంపూర్తిగా ఉన్న చెరువులకు కాల్వల నిర్మాణం కోసం  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట కోట్లాది నిధులను చెరువుల మరమ్మతుకోసం విడుదల చేసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న చెరువులకు

కాలువల నిర్మాణం కోసం కాసిపేట మండలంలో  రూ. 7.5 కోట్ల  నిధులను విడుదల చేసింది. చెరువుల మరమ్మత్తు నిధుల పనులన్నీ  అధికార పార్టీకి చెందిన నాయకులు గుత్తేదారులుగా మారి పనులు చేపట్టారు. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కూడా చెరువుల నిర్మాణం పనులను ఈ నాయకులే చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో కి మారే అగ్రకులాలకు చెందిన నాయకులే మండలంలోని చెరువులు, రహదారుల పనులు చేపట్టడం ఈ మండలంలో ఆనవాయితీగా ఉంది. అధికార పార్టీ నాయకుడిగా చలామణి కావడం రాష్ట్ర ప్రభుత్వ అండదండ లతో ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడం వల్ల చెరువుల పనుల్లో నాణ్యత లోపించింది. చెరువుల మరమ్మతుల కోసం విడుదలైన నిధులు వృధా అయ్యాయి. 

దేశంలోనే సాగునీటి ప్రాజెక్టుల  నిర్మాణంలో రికార్డు సృష్టిస్తున్న సల్పల వాగు చెరువు నిర్మాణం గురించి తెలుసుకుందాం!..

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ప్రధాన రహదారి పక్కన  కోమటి చేను శివారు గుండా ప్రవహించే  సల్పల వాగు పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో 2003 సంవత్సరంలో  3 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పెద్ద చెరువు మంజూర అయింది  ఈ చెరువు నిర్మాణం ప్రపంచ బ్యాంకు నా బర్డ్ నిధులు రూ.7.60 కోట్లతో  చెరువు నిర్మాణం పనులు చేశారు. పెద్ద చెరువు నీరు ఎడమ కాలువ ద్వారా కోమటి చేను, దుబ్బగూడం, గుండ్ల పహాడ్, సంధ్రల్ పహాడ్, ముత్యం పల్లి కాసిపేట గ్రామాల పరిధిలోని 1200 ఎకరాల ఆయకట్టుకు అందాలి.కుడి కాలువ ద్వారా గురవాపూర్, చిన్న ధర్మారం, మామిడిగూడెం, పెద్ద ధర్మారం మందమర్రి గ్రామాల పరిధిలోని 1800 ఎకరాల  సాగునారి అందించడం దీని లక్ష్యం. 

సల్పలవాగు పెద్ద చెరువు నిర్మాణంలో అడుగడుగునా ఆటంకాలు. 

 కోమటి చేను గ్రామ శివారులో ప్రవహించే  సల్ఫల వాగుపై  చెరువు నిర్మాణం పనులు మొదటి నుండి ఆటంకాల మధ్యనే కొనసాగుతున్నా యి. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో  చెరువు పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పచెప్పారు. చెరువు నిర్మాణం పనులు ప్రారంభించేందుకు భూమి పూజ చేస్తున్న సమయంలోనే ముంపు భూములకు నష్ట పరిహారం చెల్లించనిది పనులు ప్రారంభించవద్దని రైతులు చెరువు నిర్మాణం  పనులను అడ్డుకున్నారు. ఈ వివాదము మూడేళ్లు కొనసాగింది. 2007లో ప్రభుత్వం పరిహారం చెల్లించి చెరువు పనులు ప్రారంభించేం దుకు సిద్ధపడింది. పెరిగిన ధరలకు అనుగుణంగా పాత రేటు తమకు గిట్టుబాటు కాదని గుత్తేదారులు మెలిక పెట్టి కొత్త రేటు సాధించు కుని పనులు ప్రారంభించారు. కరీంనగర్ చెందిన గుత్తేదారు 

 చెరువు పనులను శరవేగంతో ప్రారంభించి 2008 సంవత్సరంలో పూర్తి చేశారు. వర్షాకాలం కు ముందే పనులు పూర్తిచేయాలని తొందరలో గుత్తేదారు జలాశయం నిర్మాణం చేసేందుకు వాడుకున్న దారిని మూసి వేయడంలో నిర్లక్ష్యం వహించాడు. ఫలితంగా 2008 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు జలాశయం గండిపడింది. మళ్లీ 2009లో గుత్తెదారు మరమ్మతు పనులు ప్రారంభించి జూన్ లో పూర్తి చేశారు. గత 14 ఏళ్లుగా  చెరువు లో సమృద్ధిగా నీరు చేరుతుంది. ప్రతి వర్షాకాలంలో చెరువు నిండి మత్తడి దూకి నీరు వృధాగా వాగులో కలిసిపోతుంది .

కుడి,ఎడమ కాలువల నిర్మాణం పనుల్లో తీవ్ర  నిర్లక్ష్యం. 

సల్ఫల వాగు చెరువు నిర్మాణం పూర్తయి 14 ఏళ్లు గడిచి చెరువు నిండా నీరు పుష్కలంగా చేరుకున్న  కాలువల ద్వారా భూములకు సాగునీరు  చేరుకోవడం లేదు. కాలువల నిర్మాణం పనులను రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారే అగ్రకుల అధికార పార్టీ నాయకుడు టెండర్ల ద్వారా చేజిక్కించుకున్నాడు. కాలువల పనులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో 1.5 కోట్ల తో టెండర్లు పిలిచి గుత్తేదారు కు అప్ప చెప్పింది. కుడి కాలువలో ముంపుకు గురైన రైతులకు పరిహారం చెల్లించక ముందే 2008లో పనులు ప్రారంభించి  పూర్తి చేశాడు. కుడి కాల్వ కింద గుత్తేదారుకు సంబంధించిన సాగు భూమికి సాగునీరు అందించాలని  పనులు త్వరగా పూర్తి చేశాడు. ఎడమ కాలువ నిర్మాణం పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నాడని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నా రు. ఎడమ కాలువ ముంపు రైతులు పరిహారం చెల్లించిన తర్వాతనే పనులు చేపట్టాలని పనులు అడ్డుకోవడంతో ప్రభుత్వం  2011లో  రైతులకు కాలువల పరిహారం చెల్లించి పనులు ప్రారంభించింది. రైతులకు పరిహారం ముట్టి 12 ఏళ్లు గడుస్తున్నా గుత్తేదారు  ఇంకా పనులను కొనసాగిస్తూనే.. ఉన్నాడు.

చెరువు పనుల కోసం మిషన్ కాకతీయ లో 4.5 కోట్ల విడుదల.

సల్ఫల వాగు చెరువు కాలువల నిర్మాణం చేయడంలో తీవ్ర జాప్యం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని పనులు  పూర్తి చేయాలంటే మరిన్ని నిధులు కావాలని కొంతకాలం పనులు నిలిపివేశారు. 2016లో  తెరాస ప్రభుత్వ హాయంలో  అధికార పార్టీకి చెందిన గుత్తేదారు తన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి  హరీష్ రావు తో మాట్లాడుకుని  స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో సిఫారసు చేసుకొని 4.5 కోట్ల నిధులు మంజూరు చేయించు కున్నాడు.మిషన్ కాకతీయ ద్వారా మంజూరైన నిధులతో  2017 ఖరీఫ్ సీజన్ వరకు కుడి ఎడమ కాలువల పనులు పూర్తిచేసి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలి. తెరాస ప్రభుత్వం రెండవ సారీ ఐదేళ్ల పరిపాలన పూర్తి చేసి మళ్లీ ఎన్నికలకు వచ్చేనాటికి కూడా కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. 

 ఎడమ కాలువ పరిస్థితి ఇలా ఉంది...

 ఎడమ కాలువ పనుల ముంపు రైతులకు 2011లో  డబ్బులు చెల్లించి పనులు ప్రారంభించారు. కాలువ పనులు 13 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో రాళ్లవాగు ప్రాజెక్టు నుండి మీరు వచ్చేందుకు కొమటి చేను శివారు వరకు తవ్విన కాలువ ఉంది ఆ కాలువ ముప్పులో ఉన్న రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించింది. నీరు రాక కాలువ నిరుపయోగంగా ఉంది. అదే కాలువను సల్ఫలవాగు చెరువుకు  వాడుకోకుండా మరో కాలువను తవ్వారు. దాని విషయంలో కోమటి చేను రైతులకు వివాదం తలెత్తింది. కాలువను పూర్తి చేయక మధ్యలో విడిచిపెట్టడం వల్ల వర్షాకాలంలో కాలువ నుండి పంట పొలాలకు నీరు వస్తుందని నీటి వల్ల పత్తి పంట పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ పనులు చేసే గుత్తేదారు మరో వ్యక్తికి గత సంవత్సరం పనులు అప్పచెప్పిన నేటికీ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.  ఎడమ కాలువ కింద 1200 ఎకరాలక భూమికి సాగునీరు అందించాల్సిన చెరువు నీరు ఎకరం భూమికి కూడా సాగునీరు అందించక  కోట్లాది ప్రజాధనం వృధా అయింది. 

కుడి కాల్వ పరిస్థితి కూడా అంతే.. 

 గురువాపూర్ సమీపంలో గండి పడ్డ కుడి కాల్వ దృశ్యం.

కుడి కాలువ కింద 1800 ఎకరాల వీడు భూములకు సాగునీరు అందించాల్సి ఉండగా 100 ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కుడి కాలువ ద్వారా ప్రవహించే నీరు గురువా పూర్ సమీపంలో పెద్ద కాల్వకు గండిపడి నీరంతా వృధాగా  వాగులో పడిపోతున్న పట్టించు కునే వారు లేరు. కుడి కాలువ ద్వారా వెళ్లే మిగతా నీరు రైతుల పొలాలకు కాకుండా గుత్తేదారు కు చెందిన చిన్న ధర్మారం సమీపం లోని కుంటలోకి చేరి 50 ఎకరాల కు మాత్రమే సాగునీరందిస్తుందని రైతులు తెలిపారు. కుడి కాల్వపెద్ద కాలువ కింద పిల్ల కాలువలు తవ్వకపోవడం, భూములు ఎగుడు దిగుడు  ఉండడం వల్ల సాగునీరు అందక  13 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన సల్ఫల వాగు చెరువు ఆశించిన ఫలితం లేకుండా పోయింది.

ప్రభుత్వ నిర్లక్ష్యం గుత్తేదారుల స్వార్థం, నిర్మాణ వైఫల్యాలతో 13 కోట్ల వ్యయంతో నిర్మించిన సల్పల వాగు  పెద్ద చెరువు రైతుల కు ఎలాంటి ఉపయోగపడుకుండా చేపల పెంపకానికి మాత్రం పనికి వస్తుంది. ఇది గత 10 ఏళ్ల బంగారు తెలంగాణ పాలనలో కూడా బడుగు బలహీన వర్గాల రైతులకు సాగునీరు అందించని  ఒక చెరువు దుస్థితి...

 రైతులకు ఉపయోగపడక 13 కోట్ల నిధులు వృధా అయ్యాయి.

 

రామ టెంకి శ్రీనివాస్ కోమటి చేను  సర్పంచ్.

 సల్ఫల వాగు చెరువు నిర్మాణము 19 సంవత్సరాలుగా పూర్తి కాకపోవడం కాలువల ద్వారా బీడు భూములకు నీరు అందకపోవడం విచారకరం. ఎడమ కాలువ నిర్మాణంలో కాంట్రాక్టర్లు ఇంజనీర్ల  నిర్లక్ష్యం వల్లనే పనులు జరగడం లేదు. మేము సహకరిస్తాము రండి పనులు పూర్తి చేసి భూములకు నీరు అందించాలంటే పట్టించుకోవడం లేదు. కాలువల ద్వారా నీరు వస్తే ఆరుతడి పంటలు, కూరగాయలు పండించుకోవాలని రైతు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు .

 చెరువు నిర్మాణం వల్ల అధికారులకు కాంట్రాక్టర్లకే  లాభం జరిగింది.


జాడి దుర్గయ్య , ఆయకట్టు  రైతు 

 సల్ఫల వాగు చెరువు నిర్మాణం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగము లేదు, ఎడమ కాలువ కింద నీరు వస్తే రెండు ఎకరాల భూమికి నీరు అంది వరి పొలం వేసుకునేందుకు 15 ఏళ్లుగా  ఎదురుచూస్తున్నాను. పనుల గురించి పట్టించుకునే వారు లేరు.  చెరువు పనుల వల్ల కాంట్రాక్టర్లకు అధికారులకే లాభం జరిగింది.

 కాలువ నిర్మాణం మధ్యలో ఆపి నా భూమిని చెడగొట్టారు.


- దుర్గం శంకర్ ఆయకట్టు రైతు.

  సల్పల వాగు ఎడమ కాలువ మధ్యలో వరకు తవ్వి వదిలేయడం వల్ల  వర్షాకాలంలో ఊరి నుండి వచ్చిన వరద నీరు నా చేనులోకి వచ్చి పంటలు పండకుండా చెడిపోయింది. చేనులో  నీరు నిండడం వల్ల పత్తి కంది పంట వేయకుండా నష్టం జరిగింది. అధికారులు, కాంట్రాక్టర్లు,నాయకుల నిర్లక్ష్యం వల్లనే కాలువ పనులు పూర్తి కావడం లేదు.