దేవాపూర్ లో విశ్వరూప మహాసభ పోస్టర్ విడుదల.
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ముల్కల ప్రశాంత్ కు సన్మానం.

విశ్వరూప మహాసభ పోస్టర్ విడుదల చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు. 
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపికైన ముల్కాల ప్రశాంత్ ను సన్మానిస్తున్న మాదిగ దండోరా నాయకులు.
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవాపూర్ లో మాదిగ దండోరా వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ నిర్వహించే విశ్వరూప మహాసభ పోస్టర్ ను ఈరోజు దేవాపూర్ మాదిగ దండోరా ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈనెల 11న హైదరాబాదులో జరిగే విశ్వరూప మహాసభకు మాదిగలంతా తరలిరావాలని మాదిగ దండోరా జిల్లా ఉపాధ్యక్షుడు ములకాల ప్రశాంత్ కోరారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపికైన ములకాల ప్రశాంత్ ను దేవాపూర్ మాదిగ దండోరా నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిప్పకుర్తి బాపు మాదిగ, కందుకూరి వెంకటేష్ మాదిగ, ఉప్పులేటి లచ్చయ్య మాదిగ, చొప్పదండి సాయి అనిల్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.