మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలలో చేరికలు.

 కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ జెడ్పిటిసి రైతు సత్తయ్య, మాజీ సింగిల్ విండో. చైర్మన్ వంశీధర్ రావు 

 మాజీ సింగిల్ విండో చైర్మన్ వంశీధర్ రావుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నా వివేక్ వెంకటస్వామి.


Scv News Kasipet :--

 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారం ప్రారంభం కావడంతో వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులు,కార్యకర్త లు జంపు జలానీలుగా మారి  పార్టీలు మారుతున్నారు. నిన్నటి వరకు అదే పార్టీలో కొనసాగిన నాయకులు తెల్లవారేసరికి పార్టీలు మారుతుండ డం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో ఈరోజు కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీలలో చేరికలు జరిగాయి. సోమగూడెంలో  వివేక్ వెంకటస్వామి సమక్షంలో మాజీ జెడ్ పి టి సి రౌతు సత్తయ్య, మండల మాజీ సింగిల్ విండో చైర్మన్ వంశీధర్ రావు, మాజీ ఎంపీటీసీ రాపర్తి  శ్రీనివాస్, మాల మహానాడు నాయకుడు నస్పూర్ నర్సింగ్, స్థానికులు సిద్ధంబాపు, సిద్ధం రాములు,కురుమ నరసయ్య లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివేక్  వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుండి పోటీ చేసిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్ కు రహస్యంగా మద్దతు తెలిపి ప్రచారం చేశారని వంశీధర్ రావును మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దూరం పెట్టారు. ఇటీవల కొంత కాలంగా వంశీధర్ రావు మళ్ళీ చిన్నయ్య వెంటనే తిరుగుతూ వివేక్  బిజెపి  నుండి కాంగ్రెస్ లోకి మారడంతో మాజీ జెడ్ పి టి సి  రౌత్ సత్తయ్య ను తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి మారారు.

మాజీ ఎంపీటీసీ రాపర్తి శ్రీనివాస్, అంబేద్కర్ వాదినంటూ తిరిగే నస్పూరి నర్సింగం లు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో వారికే తెలియదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుండి బి ఆర్ఎస్ పార్టీలో కి మూడుసార్లు మారారు. నిన్నటి వరకు మాజి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వెంట తిరిగి తమ పనులు చేసుకుని మళ్లీ ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. 


కొండాపూర్ యాపలో...

 కొండాపూర్ యాపలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒళ్ళెపు రాజు.

కొండాపూర్ వడ్డెర గూడెం లో  ఒల్లెపు రాజు ఆధ్వర్యంలో యువకులు మహిళలు  బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఒల్లెపు రాజు చురుకైన యువకుడిగా గ్రామంలో  మంచి పేరు ఉండడం కాంగ్రెస్ పార్టీ కి లాభం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి.  

దేవాపూర్ లో బిఆర్ఎస్ లోకి మైనారిటీ నాయకులు.

 దేవాపూర్ లో టిఆర్ఎస్ లో చేరిన మైనార్టీ నాయకులు.

దేవాపూర్ గ్రామంలో మైనారిటీ దేవాపూర్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో 30 మంది మైనారిటీ

 యువకులు బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు వడ్లూరు మల్లేష్, మద్దిమడ సర్పంచ్ ఆడే జంగు, అనంతరావు పురుషోత్తం  సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు.