సల్పల వాగు వెంకటాద్రి దేవాలయం వద్ద ఘనంగా దండారి దర్బార్ ఉత్సవం.
- ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
![]() |
| సల్ఫల వాగు దండారి లో పాల్గొనేందుకు వచ్చిన గుస్సాడీ నృత్య కళాకారులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం మద్దిమాడ పంచాయతీ పరిధిలోని సల్పల వాగు సమీపంలోని వెంకటాద్రి దేవాలయం వద్ద ఈరోజు దండారి దర్బార్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గిరిజన గ్రామాల నుండి గుస్సాడీ దండారి బృందాలు తమ సాంప్రదాయ డప్పు డోలు వాయిద్యాలతో గిరిజన కుటుంబాలు తరలివచ్చాయి. మండలంలోని రాంపూర్, దేవాపూర్ , తుడుం గూడెం, సాలె గూడెం,గురువాపూర్, తిర్యాని మండలాల నుండి కూడా దండారి బృందాలు వచ్చాయి. వెంకటాద్రి దేవాలయంలో మొక్కులు తీర్చుకొని గుస్సాడీ దండారి బృందాలు దండారి దర్బార్ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసిన స్థలాలలో గిరిజన సాంప్రదాయాలతో తమ ప్రదర్శనను నిర్వహించారు. దండారి బృందాల ప్రదర్శనను చూసేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సాయంత్రం వరకు దండారి బృందాలు తమ ప్రదర్శనలతో తిలకించేందుకు వచ్చిన ప్రజలనుఎంతో ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుండి వచ్చిన దండారి బృందాల కుటుంబ సభ్యులు సల్ఫల వాగులోనే వంటావార్పులు నిర్వహించారు. ఓరియంట్ యాజమాన్యం కూడా ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన ప్రజలకు గిరిజనులకు భోజన సదుపాయాన్ని కల్పించారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా సల్ఫల వాగులో దండారి దర్బారు నిర్వహిస్తున్న కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వము స్థానిక ఓరియంటి యాజమాన్యం పట్టించుకోవడంలేదని గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులకు ఆటవిశాఖ కూడా ఆటంకాలు కల్పిస్తు న్నాయని ఈ విషయమై ప్రభుత్వ అధికారులు చొరవ చూపి వెంకటాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.
ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
సల్ఫలవాగులోని దండారి దర్బార్ కార్యక్రమంలో గుస్సాడీ బృందాల ప్రదర్శనను తిలకించే మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. గిరిజనుల సాంస్కృతిక ప్రదర్శనాలను తిలకించి గిరిజనుల ఉద్దేశించి మాట్లాడారు. గిరిజనులు తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ తమ పిల్లలకు మంచి విద్యా బోధన చెప్పించాలని అన్నారు. ఆయన వెంట మండల ఎంపీపీ రోడ్డ లక్ష్మి,జెడ్పిటిసి పల్లె చంద్రయ్య దండార్ దర్బార్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆడే జంగు, ప్రధాన కార్యదర్శి అనంతరావు, స్థానిక గిరిజన నాయకులు ఉన్నారు.


