సాలె గూడెంలో కొమరం భీమ్ 83వ వర్ధంతి కార్యక్రమం.

సాలె గూడెంలో కొమరం భీం వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆదివాసి నేతలు.
Scv News Kasipet:--
కాసిపేట మండలం గట్రావ్ పల్లి పంచాయతీ పరిధిలోని సాలెగూడంలో ఈరోజు గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ 83వ వర్ధంతి కార్యక్రమం ఆదివాసి యూత్ సాలెగూడం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జల్ జంగల్ జమీన్ కోసం నైజాం సర్కులర్తో విరోచితంగా పోరాడి అమరుడైన కొమరం భీము ను స్మరించుకుంటూ రాబోయే రోజులలో ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసి నాయకులు మాట్లాడారు. ప్రస్తుతం ఆదివాసులకు జరుగుతా అన్యాయాలు, యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా విద్యపై దృష్టి సారించాలని పలువురు నాయకులు గిరిజనులకు సూచించారు.
ఈ కార్యక్రమం లో నిర్వహణ కమిటీ అధ్యక్షుడు శిడాం గణపతి, రాయి సెంటర్ మండల అధ్యక్షుడు మేశ్రమ్ మహదు, ఉపమేడి కుమ్మరం జనార్ధన్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు అడే జంగు, ఆదివాసి సేన మండల అధ్యక్షుడు మడవి వెంకటేష్, ఉపాధ్యక్షుడు పెంద్రం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
