M21 ఆధ్వర్యంలో రాజ్యాంగం పై అవగాహన వ్యాసరచన పోటీలు.
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో M21( 21వ శతాబ్ద బహుజన ఉద్యమం ) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం పై అవగాహన, ఓటు హక్కు విషయమై ఇంటర్ విద్యార్థులకు ఈరోజు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. వ్యాసరచన పోటీలో జూనియర్ కాలేజీ విద్యార్థులతో పాటు మోడల్ కాలేజ్ ఇంటర్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
8🌹ఈ సందర్భంగా m21 మండల ఇన్చార్జి పల్లె మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులకు బాబా సాహెబ్ అంబేద్కర్ దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం సోదరా భావం కల్పించేందుకు రచించిన రాజ్యాంగంలో పౌరుల విధులు, బాధ్యతలు,హక్కుల విషయమై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు 21 శతాబ్దపు బహుజన ఉద్యమ సంస్థ M21 ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.వ్యాసరచన పోటీలో గెలుపొందిన ప్రధమ ద్వితీయ విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.శనివారం కాలేజీ ఆవరణలో జరిగే M21 ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రాజ్యాంగం పై విద్యార్థులకు ఉపన్యాస పోటీలను కూడా నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
జిల్లా m21 ఆపరేషన్ టీం సభ్యుడు కొమ్ముల బాపు మాట్లాడుతూ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల విషయమై సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు విద్యార్థులకు కూడా అవగాహన ఉండాలని వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడ్డారని అన్నారు. రాజ్యాంగంలో మన ఇప్పుడు ఎన్నో హక్కులు కల్పించాడని అవగాహన లేకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అన్నారు.
జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ రవీందర్ మాట్లాడుతూ M 21 ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు రాజ్యాంగం పై అవగాహన కల్పించే వ్యాసరచన పోటీలు నిర్వహించడం అభినంద నీయమని అన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించే ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్లు జ్యోతి కుమార్ ,రమేష్, చంద్రశేఖర్, మహిళ లెక్చరర్లు భాగ్య,సత్తెమ్మ లు పాల్గొన్నారు.

